సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు పొగ పెడుతున్న వైసీపీ మహిళా నేత

2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పలు రాజకీయ పార్టీలలో టిక్కెట్లపై లొల్లి జరుగుతోంది.ముఖ్యంగా ఏపీలోని అధికార పార్టీ ఓవర్ లోడ్‌గా కనిపిస్తుండటంతో టిక్కెట్ల కోసం పంచాయతీలు రచ్చకెక్కుతున్నాయి.

 Ycp Woman Leader Satyapriya Who Is Vying For The Sitting Mla Seat Details, Andhr-TeluguStop.com

నియోజకవర్గాల విభజన జరిగితే అదనంగా మరో 50 సీట్లు పెరిగేవి.కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ ఉండదని తెలిసిపోయింది.

దీంతో ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థుల వరకు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో రిజర్వుడ్ నియోజకవర్గం తిరువూరు నుంచి పోటీ చేసేందుకు ఓ మహిళా నేత సిద్ధమయ్యారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

మాజీ డిప్యూటీ సీఎం దివంగత కోనేరు రంగారావు మనవరాలు సత్యప్రియ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో వైఎస్‌కు కోనేరు రంగారావు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు.అయితే వైఎస్ మరణించిన తర్వాత కోనేరు రంగారావు మనవరాలు సత్యప్రియ వైసీపీలో చేరారు.

దీంతో 2109 ఎన్నికల్లోనే ఆమె టిక్కెట్ ఆశించారు.

కానీ ఆ ఎన్నికల్లో తిరువూరు నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధికి వైసీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది.

ఎందుకంటే జగన్ జైలులో ఉన్నా తిరువూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కొక్కిలిగడ్డ రక్షణనిధి నిర్వహించారు.

Telugu Andhra Pradesh, Cm Jagan, Koneru Rangarao, Ntr, Satyapriya, Tiruvuru, Ysr

అందుకే ఆయనంటే జగన్‌కు చాలా ఇష్టం.ఇప్పుడు సత్యప్రియ సీన్‌లోకి ఎంటర్ కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉంటుందా లేదా ఊడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సత్యప్రియ చెప్పడం వెనుక కొందరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది.

అటు రక్షణనిధి కూడా అసంతృప్తిలో ఉన్నారని టాక్ నడుస్తోంది.జిల్లాలో తాను ఎంతో సీనియర్ నేతను అని.తనకు మంత్రి పదవి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని వాపోతున్నారు.ఇలాంటి పరిస్థితులు సత్యప్రియను కొందరు రంగంలోకి దించి రక్షణనిధికి షాక్ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ వీరిలో ఎవరికి టిక్కెట్ కేటాయిస్తారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube