కీల‌క‌మైన చోట వైసీపీకి అభ్య‌ర్థి క‌రువ‌య్యారే..?

ప్ర‌తి పార్టీకి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి.ఆ లెక్క‌లే ఆ పార్టీకి కీల‌కం.

 Ycp Troubling To Find Key Candidate For Vijayawada Constituency Details, , Ycp,-TeluguStop.com

ప్ర‌తి పార్టీకి ఆ రాష్ట్రంలోని కొన్ని కీల‌క ప్రాంతాల్లో ప‌ట్టు ఉంటేనే గెలుస్తామ‌నే ధీమా ఉంటుంది.అయితే ఏపీలో కీల‌క‌మైన ప్రాంతం ఏదైనా ఉందా అంటే… అది బెజ‌వాడ అనే చెప్పొచ్చు.

ఏపీకి రాజధానిగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఆర్థిక‌, రాజ‌కీయ అండ ప్ర‌తి పార్టీకి చాలా కీల‌కం.అభివృద్ధి చెందిన జిల్లా కాబ‌ట్టి ఇక్క‌డ జెండా ఎగ‌రేయ‌డం ప్ర‌తి పార్టీ ఒక ప్ర‌తిష్టలాగా భావిస్తుంది.

కానీ ఇంత కీల‌క‌మైన చోట మాత్రం వైసీపీకి ప‌ట్టు లేకుండా పోతోంది.ప‌క్క‌నే ఉన్న కృష్ణా జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచిన వైసీపీ.విజయవాడలో మాత్రం వెన‌కంజ వేసింది.కీల‌క‌మైన గన్నవరంలో టీడీపీ జెండా ఎగిరింది.

అలాగే సెంట్రల్ లో మల్లాది విష్ణు, తూర్పులో గద్దె రామ్మోహనరావు లాంటి వారు టీడీపీ నుంచి గెలిచి నిల‌బ‌డ్డారు.ఇలా కీల‌క‌మైన జిల్లాలో మాత్రం వైసీపీకి కొర‌క‌రాని కొయ్య‌లా టీడీపీ నిలిచింది.

ఇక క‌నీసం ఎంపీ సీటు అయినా గెలిచి ప‌ట్టు నిలుపుకోవాల‌ని భావించినా.చివ‌ర‌కు అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ఈ సారి పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు.ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో కూడా చురుగ్గా ఉండట్లేదు.దీంతో అస‌లు ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన క్యాండిడేట్ లేర‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు చాలామంది.ఎట్టి ప‌రిస్థితుల్లో పార్ల‌మెంటు స్థానంలో గెలిచి ప‌ట్టు నిరూపించుకోవాల‌ని వైసీపీ గ‌ట్టి ప‌ట్టు మీద ఉంది.

అయినా పెద్ద‌గా లాభం మాత్రం చేకూర‌డం లేదు.పొట్లూరి మీద ఆశ‌లు వ‌దులుకోవ‌డంతో.

ఇక్క‌డ అభ్య‌ర్థి కొర‌త వైసీపీని వేధిస్తోంది.మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని నిలుపుతుందో అనేది చూడాలి.

Ycp Troubling To Find Key Candidate For Vijayawada Constituency Details, , YCP, Ap Politics, Vijayawada Constituency, Potluri Varaprasad, Tdp, Malladi Vishnu, Gadde Ram Mohan Rao, Ycp Party, Mp Seat, Jagan, Chandrababu - Telugu Ap, Chandrababu, Gadderam, Jagan, Malladi Vishnu, Mp Seat, Ycp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube