వైసీపీ ట్రబుల్ షూటర్ సాధించాడుగా ? 

వైసీపీ మంచి దూకుడు మీద మనకు ఎదురే లేదు అన్నట్లు వ్యవహారాలు చేసుకుంటూ వెళుతోంది.ఏపీ లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడుతోంది.2019 సార్వత్రిక ఎన్నికలు మినహా మిగతా ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారానికి వెళ్లలేదు.క్యాంపు కార్యాలయం నుంచే పరిస్థితి అంచనా వేస్తూ, పార్టీ నేతలకు సూచనలు చేసేవారు .నిన్న వెలువడిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తమ సత్తా చాటుతోంది.ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో వైసిపి పాగా వేసింది.

 Ycp Troubleshooter Achieved Ysrcp, Jagan, Tdp, Chandrababu, Cbn, Ysrcp Trouble S-TeluguStop.com

ఇది సరికొత్త రికార్డు టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వరుసగా చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు.

       ఇక్కడ టీడీపీ కి తప్ప మరెవరికి అవకాశం ఉండదు.

కానీ 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ముఖ్యంగా బాబు ని దెబ్బతీయడమే లక్ష్యంగా కుప్పం  నియోజకవర్గంపై వైసిపి పూర్తిగా దృష్టి సారించి సక్సెస్ అయింది.

అయితే ఇదంతా సాధ్యం కావడానికి వైసీపీలో కీలక వ్యక్తి, జగన్ కు అత్యంత సన్నిహితుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ జగన్ కు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ ట్రబుల్ షూటర్ గా ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది.చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వైసిపి ట్రబుల్ షూటర్ గా మారిపోయారు.

కేవలం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు, మిగతా అనేక చోట్ల జరిగిన ఎన్నికల్లో ఆయన పూర్తిగా వైసీపీ తరుపున బాధ్యతలు నిర్వహించి రాజకీయ ప్రత్యర్ధులకు వ్యూహాలను అమలు చేశారు.

 

Telugu Ap, Chandrababu, Jagan, Ysrcp, Ysrcp Shooter-Telugu Political News

    తనకు అప్పగించిన అన్ని వ్యవహారాలను దిగ్విజయంగా పూర్తి చేసి తన సత్తా చాటుకున్నారు.ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని వైసిపి ఖాతాలు పడే విధంగా రామచంద్ర రెడ్డి వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఆయన శక్తి సామర్ధ్యాలు ఏమిటో వైసిపి తో పాటు , మిగతా రాజకీయ వర్గాలకు అర్థం అయిపోయింది.ఆయన సామర్ధ్యాన్ని గుర్తించి జగన్ మొదటి నుంచి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే తాను కాలు బయట పెట్టకుండా వైసిపి కి విజయాలు నమోదు చేయడం లో సక్సెస్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube