అలా దెబ్బకొడదాం ! ఇలా ప్లాన్ చేసుకుంటున్న రెండు పార్టీలు  

Ycp-tdp Plan To Beat Janasena-ap Politics,chandra Babu,janasena Party,ys Jagan

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేయడం సహజం. తమ పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తీవ్రంగా తలపడుతున్నాయి. ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలనే ఆలోచనతో మైండ్ గేమ్ ఆడేందుకు సిద్ధం అవుతున్నాయి..

అలా దెబ్బకొడదాం ! ఇలా ప్లాన్ చేసుకుంటున్న రెండు పార్టీలు -YCP-TDP Plan To Beat Janasena

ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను ఎలా అయినా తమ దారికి తెచ్చుకుని లాభపడాలని రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో తమ పార్టీదే విజయం అంటూ అనేక సర్వేలను బయటకి వెల్లడిస్తూ ప్రత్యర్థి పార్టీలను కంగారుపెట్టిస్తున్నాయి.

అలాగే ఓటర్లకు నేరుగా మెసేజ్ లు పంపుతూ, ఫోన్ కాల్స్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి రెండు పార్టీలు. ఎన్నికల సమయంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

ఇక వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో గెలుపు వైసీపీదే అంటూ లెక్కలతో సహా చెప్తూ క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నాడు. అభ్యర్థులకు వచ్చే ఓట్ల పర్సంటేజ్ ఎంత అనేది డేటా బ్యాంకు ద్వారా నియోజకవర్గంలోని ఓటర్లకు ఫోన్ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఇదే ఫరూములను జనసేన పార్టీ అభ్యర్థులు కూడా అక్కడక్కడా ప్రయోగిస్తున్నారు..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్ధి తోట చంద్రశేఖర్ పీకే సర్వే, సీఓటర్ సర్వే, నీల్సన్ సర్వే అంటూ ఏవేవో సర్వేల పేర్లు చెప్పి ఆ సర్వేల్లో తాను ముందున్నానని, ఆ నియోజకవర్గంలోని మెజార్టీ ఓటర్లకు ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు.

ఎక్కడికక్కడ టీడీపీ, వైసీపీ పార్టీలు సర్వేల్లో తామే ముందున్నాము అంటే తామే ముందున్నాము అంటూ చెబుతూ ఓటర్లతో మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. పోలింగ్ కు నాలుగు రోజుల ముందుగానే వైసీపీ, టీడీపీ తాము గెలవబోతున్నాము అంటే తామై గెలవబోతున్నాము అంటూ చెబుతూ ఆడాల్సిన మైండ్ గేమ్ ఆడేస్తున్నాయి.

ఇందులో ఓటర్లను మాత్రం గందరగోళం లోకి నెట్టేస్తున్నాయి. మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని ప్రతి పార్టీ హోరెత్తించే ప్రకటనలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. కానీ ఓటర్లు మాత్రం తమ మనసులో ఏముంది అనేది స్పష్టంగా మాత్రం తెలియడంలేదు.