ఆ ఆర్మీకే వార్నింగ్ ఇచ్చిన ఏపీ మంత్రి ?  

Ycp Tdp Anil Kumar Yadav - Telugu Anil Kumar Yadav, Ap, Cbn Army, Chandrababu Naidu, Coronavirus, Lg Polyemers, Pothireddy Padu Project, Tdp, Ycp

కొద్ది రోజులుగా ఏపీ రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది.అధికార, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

 Ycp Tdp Anil Kumar Yadav

మొన్నటి వరకు కరోనా వ్యవహారం, ఆ తరువాత విశాఖ ఎల్జి పాలిమర్స్ లో విషవాయువు లీకైన సంఘటన, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన వివాదం ఇలా వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల కు గురవుతోంది.

సోషల్ మీడియాలోనూ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసే ‘ సిబిఎన్ ఆర్మీ ‘ అనే సోషల్ మీడియా ఖాతా నుంచి ఏపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు.దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

ఆ ఆర్మీకే వార్నింగ్ ఇచ్చిన ఏపీ మంత్రి -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

‘ సిబిఎన్ ఆర్మీ ‘ పేరుతో పోస్టింగ్స్ పెడుతున్న వ్యక్తులకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ముందుకు రావాలంటూ చాలెంజ్ చేశారు.ఈ సిబిఎన్ ఆర్మీ ద్వారా సోషల్ మీడియా లో పెడుతున్న పోస్టింగ్స్, కామెంట్ల ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.దీనిలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు.ఎక్కడో విదేశాల్లో, చీకటిగదుల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సిబిఎన్ ఆర్మీ వ్యక్తులకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రావాలని సవాల్ విసిరారు.

అయితే అనిల్ సవాల్ పై తెలుగుదేశం పార్టీ నుంచి గాని, సదరు సోషల్ మీడియా అకౌంట్ నుంచి గాని ఎటువంటి స్పందన రాలేదు.

అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ తన నిర్ణయం ఏమిటో స్పష్టంగా చెప్పాలంటూ ఇప్పటికే అనేకసార్లు డిమాండ్ చేసిన ఆ పార్టీ నాయకులు ఒక్కరు కూడా నోరు తెరిచేందుకు ముందుకు రావడం లేదని అనిల్ కుమార్ మండిపడ్డారు.అసలు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో మాట్లాడాల్సి ఉన్నా ఆయన దీనిపై స్పందించేందుకు భయపడుతున్నారని, రాష్ట్రం వదిలి హైదరాబాదులో తల దాచుకుంటూ ఏపీ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ అనిల్ కుమార్ మండిపడ్డారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు