పోల‌వరంపై ప‌డ్డ ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కు కొత్త చిక్కులు?

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజ‌కీయాలు అంతుచిక్క‌కుండా ఉన్నాయి.ఎలాగైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని ఆయ‌న తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 Ycp Rebel Mp Raghurama Krishnam Raju Troubling Jagan With Polavaram Issues , Ra-TeluguStop.com

ఇందులో భాగంగా ఇప్ప‌టికే త‌న‌మీద పెట్టిన రాజ‌ద్రోహం కేసు, అలాగే త‌న‌పై జరిపిన దాడికి సంబంధించి అన్ని రాష్ట్రాల ఎంపీల‌కు లేఖ‌లు రాశారు.అలాగే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, అలాగే హ్యూమ‌న్ రైట్స్ ఆఫీసుల్లోనూ ఫిర్యాదు చేశారు.

దీంతో చాలామంది ఎంపీలు కూడా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తుగా వ‌స్తున్నారు.జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇదిలా ఉండ‌గా.ఇప్పటి వ‌ర‌కు త‌న‌పై జ‌రిగిన దాడుల గురించే ఫిర్యాదులు చేసిన ర‌ఘురామ ఇప్పుడు పోల‌వ‌రం గురించి ఫిర్యాదు చేశారు.

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఈ మేర‌కు బుధ‌వారం ర‌ఘురామ క‌లిశారు.

ఏపీలోని పోలవరం ప్రాజెక్టులో ప్ర‌స్తుతం జరుగుతున్న అవినీతి గురించి కేంద్ర‌మంత్రి గజేంద్ర షెకావత్‌ను క‌లిసి లేఖ అంద‌జేశారు.

Telugu Ap Ycp, Central, Cid, Fraud Reverse, Gajendrasingh, Mpraghurama, Polavara

జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో పోలవరం నిధుల్లో 25శాతం వ‌ర‌కు కమీషన్లు తీసుకుంటూ అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ ఫిర్యాదు చేశారు ర‌ఘురామ‌.నకిలీ లబ్దిదారుల పేర్లతో ప్ర‌భుత్వ పెద్ద‌లు బ్యాంకు ఖాతాలు తెరిచి పేద‌ల‌కు అందాల్సిన పునరావస డ‌బ్బుల‌ను కాజేస్తున్నారని తెలిపారు.అలాగే రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అక్రాలు చేస్తున్నారంటూ వివ‌రించారు.అలాగే ప్రభుత్వం, సీఐడీ పోలీసులు త‌న‌ను వేధిస్తున్నారంటూ జ‌రిగిన దాడి విష‌యాల‌ను వెల్ల‌డించారు.

అయితే వీటితో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొత్త చిక్కులు త‌ప్పేలా లేవ‌ని తెలుస్తోంది.పోల‌వ‌రంపై గ‌న‌క కేంద్రం జోక్యం చేసుకుంటే ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube