ఇక ఏపి కి రాలేనేమో ? తన బాధ చెప్పుకున్న రఘురామ 

గత కొద్ది రోజులుగా నర్సాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో స్థానిక ఎంపీగా ప్రోగ్రాం కృష్ణంరాజు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని భావించారు.

 Ycp Rebel Mp Raghurama Krishnam Raju Comments Over Troubles By Ap Govt For Atten-TeluguStop.com

అయితే ఏపీకి వస్తే గతంలో నమోదైన కేసుల్లో భాగంగా తనను, తన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి కోర్టుకు సైతం వెళ్లారు.కోర్టు భరోసాతో రైలులో బయలుదేరి కొద్ది దూరం తరువాత మళ్ళీ వెనదిరిగారు.

ఈ వ్యవహారాలపై తాజాగా రఘురామ కృష్ణంరాజు స్పందించారు, ఏపీకి సీఎంగా జగన్ ఉండగా తాను ఏపీకి వస్తానని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి పోలీసులు సీఎం అదుపు ఆజ్ఞల్లో లేనప్పుడే తాను ఏపీలో అడుగు పెట్టగలనని ఆయన వ్యాఖ్యానించారు.

అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనక పోవడానికి కారణాన్ని కూడా ఆయన వివరించారు.ఆహ్వానితుల జాబితాలో స్థానిక ఎంపీగా తన పేరు లేకపోవడంపై ఏపీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రఘురామ నిరదీశారు.

తనను అభిమానించి ప్రేమించే ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసారని , ‘ ఎంపీని ఏమీ చేయం.కానీ మిమ్మల్ని ఉతికేస్తాం అని నా అభిమానులను పోలీసులు బెదిరించారు.

చదువుకునే తన ఇద్దరు కుమారులను పోలీసులు కారులో ఎక్కడికో తీసుకువెళ్లిపోయినట్లు వారి తండ్రి నాకు ఫోన్ చేసి వాపోయారు.

Telugu Ap Cm Jagan, Ap, Beemavaram, Chandrababu, Cmjagan, Prime Modi, Raghurama,

పోలీసులు పెడుతున్న ఇబ్బందులను ఒక్కొక్కరిగా ఫోన్ చేసి తనకి చెబుతుండడంతో ఏం చేయాలో పాలు పోక ప్రధాని సభకు హాజరుకాకుండా వెనతిరుగానని రఘురాము చెప్పుకొచ్చారు.ఎంపీగా తన పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి అని రఘురామ ప్రశ్నించారు.అల్లూరి సభలో తాను పాల్గొనకూడదంటూ జగన్ పత్రికకు చెందిన కొందరు పెయిడ్ కళాకారులు ఆందోళన చేశారని, దీనిపై పిఎంఓ కు నివేదిస్తానని తెలిపారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనపై పదిసార్లు లేఖలు రాశారని , అయినా చర్యలు తీసుకోలేదని చెప్పారు.

Telugu Ap Cm Jagan, Ap, Beemavaram, Chandrababu, Cmjagan, Prime Modi, Raghurama,

పార్లమెంటరీ లార్డ్ జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడిని అయినా తనకే అన్యాయం జరిగిందన్నారు.పరిటాల రవి, వైయస్ వివేకానంద రెడ్డి హత్యల్లోను పోలీసులను వాడుకున్నారని విమర్శించారు.ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ గా చెప్పుకున్న ఒక వ్యక్తిని సోమవారం తన ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారని తెలిపారు.

ఐడి కార్డు తెచ్చుకోలేదని ఆ వ్యక్తి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ,తన హత్యకు పోలీసులను వాడుతున్నారేమోనని అనుమానం కలుగుతుందని , దీనిపై కోర్టునూ ఆశ్రయిస్తానని రఘురామ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube