రాజ‌ద్రోహం కేసు ర‌ద్దుకు క‌లిసిరండి.. మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న ర‌ఘురామ‌

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.త‌న‌పై మోపిన రాజ‌ద్రోహం కేసు, అలాగే త‌న‌పై క‌స్ట‌డీలో జ‌రిగిన దాడికి వ్య‌తిరేకంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు ర‌ఘురామ‌.

 Ycp Rebel Mp Raghurama Gathering Support To Cancel Rajadroham Act-TeluguStop.com

ఈయ‌న కేసులో మొద‌టి నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్‌లే త‌గులుతున్నాయి.మొద‌ట బెయిల్ రాక‌పోతే.

ర‌ఘురామ సుప్రీంకోర్టుకు వెళ్లి మ‌రీ బెయిల్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

 Ycp Rebel Mp Raghurama Gathering Support To Cancel Rajadroham Act-రాజ‌ద్రోహం కేసు ర‌ద్దుకు క‌లిసిరండి.. మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న ర‌ఘురామ‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ త‌ర్వాత ఏపీ సీఐడీ పోలీసుల‌కు కూడా నోటీసులు జారీ చేసింది కోర్టు.

ఇక ర‌ఘురామ కూడా అంత‌టితో ఆగ‌డ‌కుండా త‌న‌పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హ్యూమ‌న్ రైట్స్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేశారు.అలాగే త‌న తోటి ఎంపీల‌కు దాడిని వివ‌రిస్తూ లేఖ‌లు రాశారు.

దీంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా చాలామంది ఎంపీలు గ‌ళం విప్పుతున్నారు.

ఇక ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ రాజ‌ద్రోహం కేసులో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు.

ఈ మేర‌కు సోమ‌వారం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఐదు పేజీల లేఖ‌ను రాశారు.రాజద్రోహం కేసులో సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఇత‌ర సాక్ష్యాల‌ను ఆ లేఖకు జతచేశారు ఆయ‌న.

Telugu Ap And Ycp, Ap Cm Jagan, Arrested Mp Raghurama Krishnam Raju, Cancel Rajadroham Act, Delhi Cm Aravind Kejriwaal, Gathering Support, Rajnath Singh, Supreme Court, Ycp Rebel Mp Raghurama-Telugu Political News

త‌న‌పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ మ‌ద్ద‌తు తెల‌పాలని కోరారు.త‌న‌కు ఐదు నెలలక్రితమే ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో బైపాస్ స‌ర్ప‌రీ జరిగిందని, అయినా క‌నిక‌రం చూపించ‌కుండా దాడి చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.రాజ‌ద్రోహం కేసు ర‌ద్దుపై ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకోవాల‌ని ర‌ఘురామ కేజ్రీవాల్‌ను కోరారు.మ‌రి దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మొత్తానికి ర‌ఘురామ మాత్రం బాగానే మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు.

#Rajnath Singh #YcpRebel #Supreme Court #AP CM Jagan #AP And YCP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు