వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడుకు కీలక కామెంట్స్..!!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని కొద్ది గంటల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఆయన నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే.కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించే రీతిలో వివాదాలు సృష్టించే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు.

పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణం రాజు కొడుకు భరత్.తన తండ్రి ని అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు.

 Ycp Rebel Mp Raghuram Krishnan Rajus Son Shocking Comments-వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడుకు కీలక కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనీసం నోటీసులు ఇవ్వకుండా.ముందుగా సమాచారం తెలియకుండా ఆయనను అరెస్టు చేయటం పైగా నెంబర్ ఆఫ్ పార్లమెంట్ హోదా కలిగిన వ్యక్తి పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని మండిపడ్డారు.ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.తన తండ్రికి హార్ట్ సర్జరీ జరిగిందని.ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ విధంగా అరెస్టు చేస్తారా .? అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే ఈ విధంగా ఇష్టానుసారంగా అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు.కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పులు తన తండ్రి ప్రశ్నించడం వల్లే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

#MPRaghuram #Bharath #AP CID

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు