అయ్యో ! రోజాను ఎవరూ పట్టించుకోవడంలేదా ?  

Ycp Party Not To Intrested In Nagari Mla Roja-jagan,lokesh Babu,ministeries,nagari Mla,roja,జగన్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బద్ద రాజకీయ విరోధి అయిన టీడీపీ మీద విరుచుకుపడాలన్నా, బాబు మీద ఆయన కుమారుడు లోకేష్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే పేరు నగరి ఎమ్యెల్యే రోజా. వైసీపీలో కీలక నాయకురాలిగా ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా చేసే ఆందోళనలో ఆమె ఎప్పుడూ ముందుండేవారు. పార్టీకి అన్నివిధాలా కాలిసొచ్చేలా ఆమె కార్యక్రమాలు రూపొందించుకునేవారు..

అయ్యో ! రోజాను ఎవరూ పట్టించుకోవడంలేదా ? -YCp Party Not To Intrested In Nagari MLA Roja

ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవుల పంపకం కూడా పూర్తయ్యింది. అయితే అందులో రోజాకు ప్రాధాన్యం దక్కలేదు.

పోనీ ఆమెకు ఏదైనా పదవి కట్టపెడదాం అనుకున్నా స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా అయిపోయాయి. చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఫిల్ అయిపోయాయి.

రోజాకు హోంమంత్రి, స్పీకర్ అని రకరకాలుగా పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఆ ప్రచారంతో రోజా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ ఆమె గురించి అస్సలు పట్టించుకోవడమే మానేసినట్టుగా కనిపిస్తోంది. అనేక సామాజిక సమీకరణాలు కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.

పోనీ వేరే ఇంకేదైనా పదవి దక్కుతుందేమో అని రోజా ఆశపడ్డారు. కానీ ఆ హామీ కూడా ఆమెకు దక్కలేదు. దీంతో ఆమె చిన్నబుచ్చుకున్నారు.

అయినా పార్టీ అగ్రనేతలెవరూ ఆమెతో మాట్లాడలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కొలువుతీరిన మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత కొత్తగా మరికొంతమందికి అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు కాకపోయినా ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఇంకా నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి.

అయితే మంత్రి పదవితో పోల్చుకుంటే వాటికి ప్రాధాన్యత చాలా తక్కువే. కానీ మంత్రి పదవి దక్కకపోతేనేమి ఏదో ఒక పదవి అయితే వస్తుంది కదా అని రాజీ పడితే ఆమెకు ఏదో ఒక పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ పదవిని రోజాకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీలో ప్రచారం స్టార్ట్ అయ్యింది..

అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆమె ఒప్పుకుంటారా లేక ఇచ్చింది తీసుకుని రాజీ పడిపోతారా అనేది పార్టీ నుంచి ఏదైనా ప్రకటన వస్తే కానీ తెలియదు.