ఎన్డీయే తో కలవనున్న వైసీపీ....వివరణ ఇచ్చిన కన్నా

ఏపీ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఎన్డీయే లో చేరుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.మోడీ,జగన్ కలిసిపోయినట్లే జగన్ ఎన్డీయే పక్షాన చేరిపోయినట్లే అన్నట్లు వస్తున్నా వార్తల పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ వివరణ ఇచ్చారు.

 Ycp Party Joins In Nda Kanna Gave Clarity About This-TeluguStop.com

వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరుతుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ రోజు గుంటూరు జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మేం వైసీపీ కి మిత్రపక్షం కాదు, అక్కడ మేము ప్రజల పక్షాన ఉంటాం అని, ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో కలుస్తుంది అన్న వార్తల్లో నిజం లేదంటూ కన్నా స్పష్టం చేశారు.

అలానే ఏపీ ప్రజలు ప్రతిష్ట్మాకంగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పై కూడా ఆయన స్పందించారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రావాల్సిన అవసరం ఉందన్నారు.

మోడీ తన ఐదేళ్ల పాలనలో పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, దేశ రక్షణ కోసం పని చేశారని.ఏం చేశారో చెప్పి ఎన్నికలకు వెళ్లి మళ్లీ విజయం సాధించారని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

బీజేపీ లో చేరేందుకు ఇతర పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపుతున్నారు అని కన్నా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube