బాబు కి ఇంటి గండం మళ్ళీ మొదలయ్యిందా ?  

Ycp Once Again Notice Issued In Chandrababu House-former Cm Chandrababu Naidu Guest House,krishna River Beside Karakatta,ycp Governament Notice Issued For Chandrababu

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిరోజులుగా రాజకీయ దూకుడు ప్రదర్శిస్తున్నాడు.వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో సైలెంట్ గా ఉన్న బాబు ఆ తరువాత మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తూ పార్టీలో జోష్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

YCP Once Again Notice Issued In Chandrababu House-Former Cm Naidu Guest House Krishna River Beside Karakatta Ycp Governament For

అయితే బాబు దూకుడికి వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చంద్రబాబు గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ప్రభుత్వం వ్యతిరేకించినట్లు కనిపించింది.

టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను సైతం కూలగొట్టారు.ఇక ఆ తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మీద దృష్టి వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది.

YCP Once Again Notice Issued In Chandrababu House-Former Cm Naidu Guest House Krishna River Beside Karakatta Ycp Governament For

  ఇది అక్రమ నిర్మాణం అని నోటీసులు జారీ చేసి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నాలు చేసింది.దీనిపై ఆ ప్రాంతంలో ఉన్న భవన యజమానులకు కూడా నోటీసులు అందడంతో కొంతమంది కోర్టు బాటపట్టారు.

అయితే ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ దుమారం రేగడంతో ఆ తరువాత ఆ వ్యవహారం సైలెంట్ అయిపోయింది.కానీ అకస్మాత్తుగా నిన్న చంద్రబాబు నాయుడు ఇంటికి నోటీసులు జారీ చేయడం, వారం రోజుల్లో ఇంటిని కూల్చి వేస్తామని నోటీసు ఇవ్వడం సంచలనం రేపింది.

ఇటీవల కృష్ణా నదిలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లు కొంతవరకు కొంతమేర గురైంది.అయితే ఉద్దేశపూర్వకంగానే నీటిని ఆపి చంద్రబాబు ఇంటిని కూల్చేందుకు వైసీపీ కుట్ర పన్నిందని అప్పట్లో టిడిపి నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.


  ఆ తర్వాత టిడిపి వైసీపీ ప్రభుత్వం ఇరుకున పెట్టేలా ఛలో ఆత్మకూరు తదితర కార్యక్రమాలకు నాంది పలకడంతో వైసిపి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.తాజాగా చంద్రబాబు కూడా నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ పోలవరం కట్టడం అంటే తన ఇంటికి నోటీసులు ఇచ్చినంత ఈజీ కాదని విమర్శలు చేశారు.

బాబు ఈ వ్యాఖ్యలు చేసిన అదే రోజు ఆయన ఇంటికి నోటీసులు రావడం అనేక అనుమానాలు కలిగిస్తోందని టిడిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

.

తాజా వార్తలు

Ycp Once Again Notice Issued In Chandrababu House-former Cm Chandrababu Naidu Guest House,krishna River Beside Karakatta,ycp Governament Notice Issued For Chandrababu Related....