జనసేన బిజెపి కలిస్తే ? నష్ఠం వీరికేనా ?

ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.రాజకీయంగా పై చేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి.

 Ycp Mp Vijaysai Reddy Comments On Tdp And Janasena-TeluguStop.com

తాజాగా బిజెపి, జనసేన పార్టీలు అతి తొందర్లోనే పొత్తు పెట్టుకోవడం కానీ, లేక బీజేపీలో జనసేన విలీనం చేయడం కానీ ఏదో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన ఉన్నా ఇప్పుడు మాత్రం ఆ ప్రక్రియ వేగవంతం అయ్యింది.

అయితే ఈ రెండు పార్టీలు కలవడం వల్ల ఏపీలో తలెత్తే రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చగా మారింది.ముఖ్యంగా జనసేన, బిజెపి కలవడం వల్ల టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ చేటు చేస్తుంది ? ఏ పార్టీకి కలిసి వస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

Telugu Janasenapawan, Pawankalyan, Tdp Chandrababu, Vijaysai Reddy, Ycpjagan, Yc

ఇదే సమయంలో వైసిపి ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఈ పొత్తు వ్యవహారంపై స్పందిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేక జనసేన అధినేత పవన్ ను బీజేపీ వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని ఆరోపణలు చేస్తున్నారు.ఈ పరిణామాలు టిడిపిలో కూడా గుబులు పుట్టిస్తున్నాయి.ఏపీలో జనసేన పార్టీకి లీడర్లు ఉన్నా కేడర్ లేదు.బీజేపీ పరిస్థితి దాదాపు ఇంతే.బిజెపికి విశాఖ సిటీ తప్ప మిగతా చోట్ల ప్రభావం అంతంతమాత్రమే.రాయలసీమలో అసలు ప్రభావమే లేదు.

ఇక గోదావరి జిల్లాల్లో కొంత ప్రభావం చూపిస్తుంది.

Telugu Janasenapawan, Pawankalyan, Tdp Chandrababu, Vijaysai Reddy, Ycpjagan, Yc

ఇక వైసిపి రాయలసీమలో బలం ఎక్కువ.ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో కూడా బాగా పుంజుకుంది.గోదావరి జిల్లాల్లో జనసేన బీజేపీ కలిస్తే ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీ మాత్రమే.

ఎందుకంటే ఈ జిల్లాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది.ఇదే భయం టీడీపీ లో కూడా ఉండడంతో ఆ రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పట్టు జారి పోతుంది అనే సందేహం టిడిపిలో ఉంది.దీనిపై వైసీపీ ధీమాగానే ఉంది.

జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నా అంతగా తమకేమీ నష్టం లేదు అనే భావన వైసీపీలో కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube