ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి అంటూ ... బాబు పై సెటైర్లు !

చంద్రబాబు నాయుడు మహానాడు వేదిక గా ఎన్నో తీర్మానాలను ప్రతిపాదించారు.ఆ తీర్మానాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు పై సెటైర్లు వేశారు.

 Vijayasai Reddy Sensational Comments On Chandrababu Naidu Details, Chandrababu,-TeluguStop.com

మహానాడులో ఏడుపు తీర్మానాలను చేశారని విమర్శిస్తూ విజయసాయిరెడ్డి మహానా (పా) డులో ఏడు (పు) తీర్మానాలు అంటూ విమర్శలు చేశారు.బాదుడే బాదుడు సిద్ధాంతకర్త చంద్రబాబును అనేక చోట్ల ప్రజలు నిలదీశారు అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

మీ హయాంలో కరెంటు చార్జీలు పెంచారు.విద్యుత్ సంస్థల పై 70 వేల కోట్ల భారం మోపలేదా అని ప్రశ్నించారు.

ఇవన్నీ పక్కనపెట్టి ఏదో విజయం సాధించినట్టు మహానాడులో తీర్మానాలు సంబరాలు అంటూ మండిపడ్డారు.వ్యవసాయం దండగ అని కొరగాని సిద్ధాంతం 20 ఏళ్ల క్రితమే రచించిన చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడులో రైతులపై తీర్మానం తో ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నానని విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.రైతుల రుణమాఫీ హామీతో 2014లో గెలిచిన బాబు కేవలం 15 శాతం మాత్రమే చెల్లించాడు.

మొత్తం మాఫీ చేస్తాం అని అనలేదని అంటాడు.నిత్య అబద్దాల కోరు అంటూ మండిపడ్డారు.1513 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే 391 కుటుంబాలకు పరిహారం చెల్లించాడు.హామీలు ఇచ్చేది మోసం చేసేందుకే కానీ నెరవేర్చడానికి కాదు అంటూ విమర్శించారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Farmers, Lokesh, Yana Reddy, Paritala, Tdp Mah

రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా 50.10 లక్షల రైతు కుటుంబాలకు ఏటా 13,500 చొప్పున ఇప్పటివరకు 24 వేల కోట్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి వేసింది జగన్ గారి ప్రభుత్వం అని, ఈ పథకం వల్ల వ్యవసాయం పండుగ గా మారిందని మహానాడులో తీర్మానం చేసి పెద్ద మనసు చాటుకో బాబు.మంచిని అభినందించడం నేర్చుకో బాబు అంటూ విజయసాయిరెడ్డి హితవు పలికారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Farmers, Lokesh, Yana Reddy, Paritala, Tdp Mah

పరిటాల ఫ్యాక్షన్ హత్యకు గురైతే ఏ జిల్లాలో ఎన్ని బస్సులు తగలబెట్టాలో టార్గెట్లు ఇచ్చింది చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.ఇప్పుడు మహానాడులో దాడులు పెరిగాయి అని తీర్మానించడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు.పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి నారాయణ రెడ్డి తో సహా మ కార్యకర్తలు 30 మందిని నరికి చంపిన పాపం నీదే బాబు అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube