చంద్రబాబు పై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి..!!

వైసిపి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా లో సెటైర్లు వేశారు.ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ చంద్రబాబు శిష్యుడు అంటూ.

 Ycp Mp Vijayasai Reddy Put Satires On Chandrababu-TeluguStop.com

గురువును మించిన డ్రామాలు ఆడుతున్నాడు అని వ్యంగ్యంగా విమర్శించారు.ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో.

దీక్షలు చేయాలని.కేఏ పాల్ నీ ప్రేరేపించింది.

 Ycp Mp Vijayasai Reddy Put Satires On Chandrababu-చంద్రబాబు పై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రబాబే అన్నట్టు సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కీలక కామెంట్లు చేశారు.విజయసాయిరెడ్డి… పెట్టిన పోస్ట్ ఈ విధంగా ఉంది.“చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడు.  కరోనా సమయంలో దీక్షలు చెయ్యాలని గురువు చంద్రబాబే అతన్ని పురమాయించాడా? సందట్లో సడేమియా అంటూ లోకేశంకు పోటీగా  బయల్దేరాడు.అద్దె మైకు కదా నోటికొచ్చినట్లు మాట్లాడతాడు.

కోవిడ్ కష్టకాలంలో ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లలో చాలా వరకు చంద్రబాబు సన్నిహితులవే.

ప్రభుత్వం తనిఖీలు చేస్తుంటే మూసి వేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటళ్ల యజమానులకు నచ్చజెప్పే బాధ్యతను బాబు తీసుకోవాలి.ఎక్కడో కూర్చుని తమాషా చూడటం కాదు.వ్యూహ రచనలో చాణక్యుడు అంతటి వాడినని భ్రమపడుతుంటాడు చంద్రబాబు.అందుకే ఏ పనికి ఏ ‘పార్టీ’ వాళ్లను వాడాలో వారిని ప్రయోగిస్తాడు.

ఫిర్యాదులు, దీక్షలు చేయిస్తాడు.దీని వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకునే లోపు సొంత మనుషులే ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని గోచీ పీకి వెళ్లిపోతారు.” అంటూ  వ్యంగ్యంగా చంద్రబాబుపై అదేవిధంగా కేఏ పాల్ పై తనదైన శైలిలో విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 

 

#Nara Lokesh #AP Politics #Social Media #Vijayasaireddy #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు