ఆ వైసీపీ ఎంపీ కి షోకాజ్ నోటీస్ ? సస్పెండ్ చేస్తారా ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో జగన్ సీరియస్ గానే ఉన్నారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా, పార్టీకి నష్టం చేసే విధంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని మరి కొంతమంది నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉందనే విషయం పైన జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు.

 Ycp Mp Raghurama Krishnam Raju, Bjp, Ysrcp,ycp Mlas,ys Jagan To Discuss About Yc-TeluguStop.com

అసలు సమయం, సందర్భం లేకుండా రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని, ఆయన బిజెపి అండదండలతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు జగన్ వ్యక్తం చేస్తున్నారు.ఆయన విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశామని, ఇంకా ఆలస్యం చేస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ఉన్న జగన్ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చే వివరణను బట్టి ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని, జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.చాలా కాలంగానే వైసీపీపై రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ, అధినేత ప్రశ్నిస్తున్నారు.ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు.

ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో భాగంగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఆయన బిజెపితో టచ్ లో ఉండటంతోనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని, పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాల కోసమే ఆయన ఆరాటపడుతున్నారని, చర్చలో పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేస్తారనే అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బిజెపిలో చేరవచ్చనే అభిప్రాయంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చర్చకు వచ్చింది.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో నివేదికను జిల్లా ఇంచార్జి మంత్రి సమర్పించబోతున్న నివేదిక ఆధారంగా, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube