వారంద‌రినీ క‌లిపేదే ర‌ఘురామ అంట‌.. త్వ‌ర‌లోనే యాక్ష‌న్ షురూ..

ఏపీలో ప్రతిపక్షాలు ఎవరికి వారే యుమనా తీరే అన్న చందంగా ఉన్నాయి.ప్రతిపక్ష టీడీపీ.

 Ycp Mp Raghu Ramakrishnam Raju To Join Bjp, Bjp, Ycp Mp Raghu Ramakrishnam Raju-TeluguStop.com

జనసేనాని పవన్‌తో పొత్తుకోసం తహతహలాడుతోంది.అయితే అక్కడి నుంచి అనుకూల పవనాలు రావడం లేదు.

ఇక, బీజేపీ, వామపక్షాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఏపీలో ఈ పార్టీల ప్రభావం అంతగా లేదనే చెప్పాలి.

బీజేపీ, వామపక్షాలు కలిసి రాజకీయ వేదికనూ పంచుకోలేవు.ఈ పార్టీల సిద్దాంతాలు వేరు కాబట్టి.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో చంద్రబాబు గట్టెక్కారు.అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి.2024లో బీజేపీ లేదా జనసేనతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా… అది ఎంత వరకు వర్కౌట్ అవుతోంది చూడాలి మరీ.ఇటీవల ఒక అంశంపై ఏపీలో ప్రతిపక్షాలు ఒకే వేదికపై కనిపించాయి.అదే రాజధాని అమరావతి.అమరావతి రైతులు పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన, బీజేపీ, వామపక్ష నేతలు హాజరయ్యారు.వీరంతా ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు.

అయితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని ఢీకొట్టడానికి ఇలా ప్రతిపక్షాలు ఏకమైతాయా? అంటే చెప్పలేని పరిస్థితి.

మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తరుపున ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.రాజధాని అంశం కాబట్టి ప్రతిపక్షాలు అయిన టీడీపీ, జనసేన, వామపక్షాలు తనకు మద్దతు ఇస్తాయని ఆయన భావిస్తున్నారు.

దీంతో ప్రతిపక్షాల మద్దతుతో ఉప ఎన్నికలో గెలిచి వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని రఘురామ భావిస్తున్నారు.మరీ, అలా జరుగుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube