జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండో దశ వారాహి యాత్ర ఏలూరు నుండి స్టార్ట్ అయ్యింది.మొదటి దశ విజయవంతం కావడంతో.
రెండో దశ వారహి యాత్రలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ ఎంపీ నందిగం సురేష్( Nandigam Suresh ).పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.లోకేష్ పాదయాత్ర ఫెయిల్ కావటం వల్లే పవన్ వారాహి యాత్ర చేపట్టినట్లు వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికలలో లోకేష్( Lokesh ) మరియు పవన్ చేతనైతే ఎమ్మెల్యేలుగా గెలవాలని సూచించారు.
ఇదే సమయంలో అమరావతిలో జరుగుతున్న ఉద్యమంపై ఎంపీ నందిగం సురేష్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమంలో చాలా మంది పెయిడ్ ఆర్టిస్టులని అభివర్ణించారు.ఇదే సమయంలో వాళ్లంతా వైసీపీ ప్రభుత్వం పై.
నాయకులపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం తిన్నది అరగక ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అమరావతిలో రియల్ ఎస్టేట్ కార్యాలయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు.ఇదే సమయంలో చంద్రబాబుని చూస్తుంటే వెన్నుపోటు పథకం గుర్తొస్తున్నట్లు ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.