వైసీపీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన రఘురాజు.. !

ఏపీలో గత కొంతకాలంగా వైసీపీకి, ఈ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య పచ్చగడ్ది వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.వైఎస్ జగన్ పైన, ఆ పార్టీ నేతల పైన ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నో సార్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 Ycp Mp, raghu Rama Krishna Raju, Meets, President, Ram Nath Kovind-TeluguStop.com

దీనికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు.కానీ ఇప్పటి వరకు ఈ మాటల యుద్ధం ముగిసిన దాఖలాలు లేవు.అయితే తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, కలిస్న ఎంపీ రఘురామ కృష్ణరాజు తన గోడు వెళ్లబోసుకున్నాడట.ఏపీలో తనపై అధికార ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, తప్పుడు కేసులు పెట్టించిందనే విషయాన్ని కూడా ప్రస్తావించారట.

ఈమేరకు తనను ఈ కేసుల నుంచి రక్షించాలని కోరినట్లుగా రఘురాజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఇకపోతే గత కొంత కాలంగా తనను సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా చేస్తున్నారంటూ రామకృష్ణరాజు సొంత పార్టీపైనే మండిపడుతున్న విషయం తెలిసిందే.

మరి ఈ విషయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏమని హామీ ఇచ్చారో తెలియదు గానీ మొత్తానికి వైసీపీ ప్రభుత్వం పై కంప్లైంట్ మాత్రం ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube