పోలవరం కు వైఎస్ ఆర్ పేరు... అనుమతులు,నిధులు తెచ్చింది ఆయన  

Ycp Mp Candidate Request Polavaram Project To Be Named As Ysr-polavaram,tdp,ycp Mp,ysr,పోలవరం ప్రాజెక్ట్,వైసీపీ పార్టీ

ఏపీ లో అధికారం చేతులు మారిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల అయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాదించడం తో ఇప్పుడు ఏపీ లో నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు గత పార్టీ అధికారంలో ఉన్న హయం లో చేపట్టిన పథకాల పేర్లు మార్చాలని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు..

పోలవరం కు వైఎస్ ఆర్ పేరు... అనుమతులు,నిధులు తెచ్చింది ఆయన-YCP MP Candidate Request Polavaram Project To Be Named As YSR

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా చెప్పుకొనే పోలవరం ప్రాజెక్ట్ పేరును మార్చాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు డాక్టర్ వై ఎస్ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ గా నామకరణం చేయాలి అంటూ ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్ట్ కు భూమి పూజ చేసింది ఆయన,అనుమతులు,నిధులు తెచ్చింది కూడా వైఎస్ఆర్.

అందుకే ఈ ప్రాజెక్ట్ కు డాక్టర్ వై ఎస్ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అంటూ నామకరణం చేయాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార్టీ విజయాన్ని అందుకున్న వెంటనే కొందరు నేతలు స్పందిస్తూ ఇంకా ఏపీ రాజధాని డిక్లేర్ కాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పడు పోలవరం ప్రాజెక్ట్ కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారు. ఇంకా ముందు ముందు ఏపీ లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం తో వై ఎస్ జగన్ ఈ నెల 30 న ఏపీ సి ఎం గా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.