టెన్షన్ పెట్టేస్తున్నావేంటి జగన్ ? పాపం వీళ్ల పరిస్థితి ఏంటి ?  

ysrcp mlas tension over the ministerial posts, YCP MLAs, YS Jagan, Mopidevi, Pilli , Speaker Tammineni - Telugu Mopidevi, Pilli, Speaker Tammineni, Ycp Mla\\'s, Ys Jagan, Ysrcp Mlas Tension Over The Ministerial Posts

జగన్ ఏ విషయాన్ని నాన్చాలి అనుకోరు.ఏదైనా తన మనసులో ఉన్నది ఖరాఖండిగా చెప్పేస్తారు.

 Ycp Mlas Tension Over Ministerial Post

చెప్పింది చేసి చూపిస్తారు.ఇక నమ్మిన వారి కోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు వెనుకాడరు.

అన్ని బాగానే ఉన్నా సొంత పార్టీ నాయకుల్లో మాత్రం రోజురోజుకు జగన్ తీరుపై అసంతృప్తి పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రభుత్వంలో అధికారులకు తప్ప, పార్టీ నాయకులు ఎవరికీ పెద్దగా విలువ ఇస్తున్నట్లుగా కనిపించకపోవడం, క్షేత్ర స్థాయిలోనూ నాయకుల ప్రమేయం లేకుండా ప్రజలకు కావాల్సిన అన్ని పనులు జరుగుతుండడంతో పార్టీ నేతల్లో కాస్త అసంతృప్తి ఉంది.

టెన్షన్ పెట్టేస్తున్నావేంటి జగన్ పాపం వీళ్ల పరిస్థితి ఏంటి -Political-Telugu Tollywood Photo Image

కానీ జనాలు మాత్రం జగన్ పరిపాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి కనిపిస్తోంది.ప్రజలకు ఏ కష్టం రాకుండా కరోనా సమయంలోనూ సమర్థవంతంగా పరిపాలన చేస్తూ, వీలైనంత వరకు జనాలను సంతృప్తిపరిచే విధంగా జగన్ పరిపాలన సాగుతోంది.

ఇదిలా ఉంటే ఈనెల 22వ తేదీన మంత్రి మండలి ప్రక్షాళన జరగబోతుందనే లీకులు ఇవ్వడంతో పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతుంది.ప్రస్తుతం మంత్రులుగా ఉండి, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ త్వరలోనే మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో, ఆ స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం తెలియక ఎవరికి వారు మంత్రి పదవులు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.మొన్నటి వరకు కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ , తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేర్లు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం రాజీనామా చేయబోతున్న మోపిదేవి, పిల్లి సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో వీరికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది.కానీ కొత్తగా ఇప్పుడు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు తెరపైకి వస్తోంది.అలాగే అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాడుగుల ముత్యాలనాయుడు పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.కొద్ది రోజులుగా స్పీకర్ తమ్మినేని రాజకీయంగా యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న నేపథ్యంలో, ఆయన కి మంత్రి పదవి జగన్ కన్ఫామ్ చేశారనే వార్తలు పెరిగిపోతున్నాయి.

ఆయనకు కనుక మంత్రి పదవి ఇస్తే, స్పీకర్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన కోన రఘుపతి కి అవకాశం ఇచ్చే ఆలోచన జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ వర్గంలో ఆదరణ పెంచుకోవచ్చనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మంత్రి పదవులు విషయమై ఎవరికి వారు తమకు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.మొదటి నుంచి జగన్ వెంట నడిచిన వారిలోనూ ఇదే రకమైన టెన్షన్ కనిపిస్తోంది.ఆశావాహులు చాలామంది ఉన్నారు.అందులోనూ జగన్ కు వీరవిధేయుల సంఖ్యకు కొదవే లేదు.

కానీ పార్టీలో దీనిపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నా, జగన్ కు ఈ విషయాలన్నీ తెలిసినా, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఎక్కడా బయటకు తెలియకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు.దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది.

#Mopidevi #YS Jagan #YCP MLA'S #Pilli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ycp Mlas Tension Over Ministerial Post Related Telugu News,Photos/Pics,Images..