జగన్ పాదయాత్రలో..చంద్రబాబు ట్విస్ట్ ఇదే     2017-10-16   01:54:03  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్ష్..మళ్ళీ రెడీ అవుతోంది..తెలివైన.. రాజకీయనాయకుడు అంటే బాబే..వైసీపీ ఎక్కడ బలంగా ఉందో చూసుకుని అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు చంద్రబాబు..ఇప్పటికే వైసీపీ బలంగా లేని ప్రాంతాలలో టీడీపీ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ స్కెచ్ తో సైకిల్ స్పీడు మరింత పెరిగిపోతుందనే నమ్మకం.. బాబులో బలంగా ఉంది..

బాబు ఈ స్కెచ్ వెనకాల కారణం లేకపోలేదు నంద్యాల ఎన్నికల ప్రభావం..ఈ స్కెచ్ కి తెరతీసింది.. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రాయలసీమలో పార్టీకి మరింత సానుకూల వాతావరణం కనిపించడంతో సీమ నేతలే తెలుగుదేశం పార్టీ టార్గెట్ గా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది.

జగన్ ఒకపక్క పాదయాత్రలో అధికార పక్షం మీద ఆరోపణలు చేస్తూ..ప్రభుత్వం పని తీరు బాగోలేదు అనే ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని చూస్తుంటే.. ఆరోపణలు చేసిన పార్టీ నుంచే..మా అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారు..అని ప్రజలకి చెప్పడం బాబు ప్లాన్..

చంద్రబాబు ప్లాన్ లో భాగంగానే ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను సైకిల్ ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం ఆపరేషన్ రాయలసీమ బాధ్యతలను మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి అమర్నాథ్ రెడ్డి, ఎంపీలు జేసీ దివాకర్రెడ్డి సీఎం రమేశ్లకు, పార్టీ అధినాయకత్వం అప్పజెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే.. ఎంపీ బుట్టా రేణుక సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు బుట్టా రేణుకతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సీఎం రమేశ్ గుర్నాథ్రెడ్డితో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొందరిని సైతం సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి శైలజానాథ్ కర్నూలు జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

కర్నూలకు చెందిన మాజీ సీఎం కోట్ల కుటుంబ సభ్యులతో కూడా టీడీపీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికల్ని ఇప్పుడే టీడీపీ బయటపెట్టదు అని తెలుస్తోంది.. జగన్ పాదయాత్ర మొదలయ్యి ప్రజలలో రెస్పాన్ భారీగా రావడం మొదలు పెట్టాక అప్పుడు వైసీపీ నాయకుల్ని పార్టీలోకి తీసుకుంటారు అని తెలుస్తోంది..బాబు ఈ నయా ప్లాన్ జగన్ పాదయత్రకి ఎంతవరకు గండికొడుతుందో.వేచి చూడాల్సిందే.