వైసీపీ ఎమ్యెల్యేలు రాజీనామా చేయబోతున్నారా ...?     2018-11-07   10:01:55  IST  Sai Mallula

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా తమ పార్టీకి మైలేజ్ బాగా పెరిగిందని, దీంతో పాటు కొద్దీ రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద కత్తి తో దాడి చేసి గాయపరచడం … దీనిపై టీడీపీ ప్రభుత్వం వివాదాస్పద కామెంట్స్ చేసి ప్రజల్లో చులకన అవ్వడం ఇవన్నీ తమ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా ఆ పార్టీ భావిస్తోంది. అందుకే పార్టీకి మరో మైలేజ్ తీసుకువచ్చే అంశం పై ఇప్పుడు దృష్టిపెట్టింది. మరి కొద్ది రోజుల్లో రాజకీయ సంచలనం కలిగించే దిశగా వైసీపీ ఎమ్యెల్యేలు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

YCP MLAs Going To Resign AP Assembly-

YCP MLAs Going To Resign To AP Assembly

ప్రస్తుతం జగన్ విశ్రాంతిలో ఉన్నారు. నవంబరు 10వ తేదీ నుంచి తిరిగి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. విజయనగరం జిల్లాలో జరగనున్న బహిరంగ సభలో జగన్ తనపై దాడిపై జగన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. జగన్ ప్రసంగం ఎలా ఉండబోతోంది..? దాడి సంఘటనపై ఎలా స్పందించబోతున్నారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదంటున్నారని, ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి సమాధానంగా… తమకు పోలీసుల మీదే కాదు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా నమ్మకలం లేదని చెప్పడానికి సంచలన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

YCP MLAs Going To Resign AP Assembly-

ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ పై దాడి – రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత వైకిరికి నిరసనగా వైసీపీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా … తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే తాము నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతే కాకుండా… జగన్ పై హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర పదో తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో 9వ తేదీన రాజీనామా చేస్తే సంచలనం అవుతుందనే నిర్ణయానికి వైసీపీ ఎమ్యెల్యేలు వచ్చినట్టు సమాచారం.