వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ మధ్య ' చైర్మన్ ' చిచ్చు ?: అధిష్టానం ఆరా ?

గెలిచే వరకు ఒక టెన్షన్ గెలిచాక మరో టెన్షన్ అన్నట్లుగా తయారైంది పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి.ఈ నియోజకవర్గంలో ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది, 28 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 25 స్థానాలు వైసిపి అభ్యర్థులు గెలుచుకోగా, రెండు స్థానాల్లో టిడిపి, ఒక స్థానంలో జనసేన విజయం సాధించాయి.

 Jangareddygudem, Munsipality, Chairparson, Medavarapu Lakshmi Jyothi, Chintalapu-TeluguStop.com

ఇక ఈ మున్సిపాలిటీ లో చైర్మన్ అభ్యర్థిగా మొదటి నుంచి ప్రచారం అవుతున్న మేడవరపు లక్ష్మి జ్యోతి కే చైర్మన్ పీఠం దక్కుతుంది అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా వైసీపీ తరఫున గెలిచిన మెజార్టీ కార్పొరేటర్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఫోన్ లు సైతం స్విచాఫ్ చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసిన లక్ష్మి జ్యోతి ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గానికి చెందిన వారు కావడంతో, ఆమెను కాకుండా తనకు అనుకూలమైన వారిని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ చేయాలని పట్టుదలతో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఉండడంతో ఇప్పుడు ఈ క్యాంపు రాజకీయానికి తెర తీసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఎమ్మెల్యే వర్గంగా ముద్రపడిన 15 మంది వార్డు కౌన్సిలర్లలను ఎమ్మెల్యే ఎలిజా రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.

తాను చెప్పిన వారికే చైర్పర్సన్ పదవి అని, వారికే ఓటు వేయాలని ఎమ్మెల్యే చెబుతున్నట్లు సమాచారం.

దీంతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది.ఇప్పటికే ఈ వ్యవహారం ప్రధాన మీడియాలో కథనం రావడం, సొంత పార్టీలోని ఎమ్మెల్యే ,ఎంపీ లు చైర్మన్ ఎంపిక విషయంలో గ్రూపు ,  క్యాంపు రాజకీయాలకు తెర తీయడంతో వైసిపి అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా నెలల నుంచి ఎమ్మెల్యే ఎంపీ మధ్య పరోక్షంగా వివాదం నడుస్తుండడం, ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ ఎంపికపై ఈ విధంగా క్యాంపు రాజకీయాలు వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.

Telugu Chairparson, Chintalapudimla, Counselors, Eluru, Janasena, Jangagudem, La

ఇవన్నీ పార్టీ పరువు తీసేవిగా ఉండడంతో, పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు, తక్షణమే ఈ వివాదానికి ముగింపు పలకాలని ఇన్చార్జి మంత్రి ని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఏ విధంగా రాజీ కుదురుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యే వర్గానికి రెండున్నర ఏళ్ళు, ఎంపీ వర్గానికి రెండున్నర ఏళ్ల పాటు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ పదవిని సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube