వైసీపీలో సీటు దక్కాలంటే... వారు డిసైడ్ చేయాల్సిందేనా ...?   YCP MLA Ticket And Candidate Will Be Decided Party Management     2018-12-08   10:26:43  IST  Sai M

తెలంగాణాలో ఎన్నికల తంతు ముగిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏపీ ఎన్నికల మీదే పడింది. ఇప్పటివరకు ఏపీ అధికార పార్టీ టీడీపీ మొత్తం ఫోకస్ అంతా తెలంగాణ మీదే పెట్టింది. ఎమ్యెల్యేలు… మంత్రులు… ఇలా అంతా తెలంగాణలోనే మకాం వేశారు. ఆ సంగతి పక్కన పెడితే… ఏపీలో అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… అధికారం కోసం ఇప్పటి నుంచే అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ… టీడీపీని దెబ్బ కొట్టేందుకు చూస్తోంది. అందుకే వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు తన ఎత్తుగడలు మార్చుకుంటూ.. ముందుకు వెళ్తున్నాడు. పార్టీ అధికారంలోకి రావాలంటే… ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండాలి అనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అంతే కాదు… ఇప్పుడు ఉన్న నియోజకవర్గ ఇంచార్జిలకు కూడా సీటు గ్యారంటీ ఇవ్వడంలేదు.

అంతే కాకుండా… బలమైన గెలుపు గుర్రాల కోసం… అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను పంపబోతోందట. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు త్వరలో రాబోతున్నారు. వీరు కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి పరిస్థితిని అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ ను జగన్ కి అందించబోతున్నారట. ఈ కొత్త ఎత్తుగడ కారణంగా… ఇపుడున్న ఇంచార్జులతో సహా ఎవరికీ సీటు విషయంలో గ్యారంటీ లేదని వైసీపీ అధినాయకత్వం తేల్చేస్తోంది. దీని కారణంగానే… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకూ గెలుపు గుర్రాల వేట సాగుతూనే ఉంటుందనే సంకేతాలను ఆశావాహులు పంపుతోంది.

YCP MLA Ticket And Candidate Will Be Decided Party Management-Janasena Pawan Kalyan TDP Management YS Jagan Ysrcp

ఈ సరి ఎన్నికల్లో గెలుపు ఖచ్ఛితంగా దక్కాలంటే… వేసే ప్రతి అడుగు ఆచూతూచి వేయాలని… గత ఎన్నికల వలె పొరపాట్లు చేస్తే మొదటికే మోసం వస్తుంది అన్న ధోరణిలో … వైసీపీ ఉంది. పని తీరు… ప్రజాబలం లేని ఇంచార్జిలను సైతం తప్పిస్తామని అధినాయత్వం తేల్చి చెప్పేస్తోంది.అకస్మాత్తుగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో… ఇంచార్జిలు…ఆశావహుల్లో .. ఒకరకమైన టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటి వరకు తమకే టికెట్ వస్తుంది అన్న ధీమాలో డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెట్టామని… ఒకవేళ టికెట్ కనుక దక్కకపోతే… అన్నిరకాలుగా నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళనలో ఇంచార్జిలు ఉన్నారు. ఏమైనా అకస్మాత్తుగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం అందరిని షాక్ కి గురిచేస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.