వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తో పాటు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయి అని ఏపీ సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం తెలిసిందే.
శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో రఘురామకృష్ణంరాజు ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ వేయటంతో.
హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణంరాజు పై వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకులు ఇప్పటికే ఆయనపై మండిపడ్డారు.తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై స్పందించారు.
కరోనా ఉందికదా అని ఎవరు పని చేయకుండా ఉండరు.అలాగే తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి కూడా లేదు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది.అంటూ రఘురామకృష్ణంరాజు వార్తపై కీలక కామెంట్లు చేశారు.
ఇటువంటి క్లిష్ట సమయంలో మీడియా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ పని చేస్తోంది.అదేరీతిలో ఏపీ సిఐడి వ్యవస్థ కూడా పని చేస్తోంది అని తెలిపారు.
రాజ ద్రోహం చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు, వదిలే ప్రసక్తే లేదు ఆ రీతిలోనే.ప్రస్తుత పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.