ఎంపీ రఘురామని వదిలే ప్రసక్తే లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తో పాటు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయి అని ఏపీ సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం తెలిసిందే.

 Ycp Mla Sensational Comments On Raghurama Krishnam Raju-TeluguStop.com

శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో రఘురామకృష్ణంరాజు ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ వేయటంతో.

హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణంరాజు పై వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 Ycp Mla Sensational Comments On Raghurama Krishnam Raju-ఎంపీ రఘురామని వదిలే ప్రసక్తే లేదంటున్న వైసీపీ ఎమ్మెల్యే..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకులు ఇప్పటికే ఆయనపై మండిపడ్డారు.తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై స్పందించారు.

కరోనా ఉందికదా అని ఎవరు పని చేయకుండా ఉండరు.అలాగే తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి కూడా లేదు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది.అంటూ రఘురామకృష్ణంరాజు వార్తపై కీలక కామెంట్లు చేశారు.

ఇటువంటి క్లిష్ట సమయంలో మీడియా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ పని చేస్తోంది.అదేరీతిలో ఏపీ సిఐడి వ్యవస్థ కూడా పని చేస్తోంది అని తెలిపారు.

రాజ ద్రోహం చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు, వదిలే ప్రసక్తే లేదు ఆ రీతిలోనే.ప్రస్తుత పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.

 

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు