అందరూ ముందు ఏడ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!!  

ysrcp,mla roja,tirupathi,nagari - Telugu Mla Roja, Nagari, Tirupathi, Ysrcp

వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా తన నియోజకవర్గానికి సంబంధించి అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అధికారులు అందరూ ఉండగానే ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

పూర్తి విషయంలోకి వెళితే తిరుపతిలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ అధికారులు తన మాట వినడం లేదని, కనీసం పట్టించుకోవడం లేదని.

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నగరిలో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కార్యక్రమానికి సంబంధించి అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.ఒక ఇళ్ల స్థలాల విషయంలో మాత్రమే కాదు, నియోజకవర్గ సమస్యలు అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అంటూ ప్రివిలేజ్ కమిటీకి రోజా ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే ఈ సమస్య ఒక్క ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో అధికారుల తీరు ఈ విధంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కనీస ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నట్లు, ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదు అన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్. 

.

#Nagari #Tirupathi #MLA Roja #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు