ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూ మరోవైపు ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.అయితే ఎన్ని పనులతో బిజీగా ఉన్నా రోజా తన కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తున్నారు.
రాజకీయాల్లో ఎన్ని టెన్షన్ లు ఉన్నా కుటుంబానికి కేటాయించిన సమయంలో ఫ్యామిలీతో రోజా సంతోషంగా గడుపుతున్నారు.
ఈ నెల 17వ తేదీన రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఆ వేడుకల్లో రోజా తన భర్త సెల్వమణితో కలిసి డ్యాన్స్ చేశారు.కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి పాటకు రోజా భర్తతో కలిసి ఆడిపాడారు.
ఆకాశమే నీ హద్దురా సినిమాలొని పాటకు రోజా అదిరిపోయే స్టెప్పులు వేసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.రోజా డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రోజా బిడియం లేకుండా డ్యాన్సులు చేయగా ఆమె భర్త సెల్వమణి మాత్రం సిగ్గు పడుతూ కాలు కదిపారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోజా, సెల్వమణి దంపతులు సూపర్ జోడీ అంటూ కామెంట్లు చేస్తూన్నారు.ఒకవైపు ఎమ్మెల్యేగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న రోజా జబర్దస్త్ షోతో పాటు ఇతర ఈవెంట్లలో పాల్గొంటూ బుల్లితెరపై కూడా అభిమానులను పెంచుకుంటున్నారు.జబర్దస్త్ షోలో పాల్గొనడం వల్ల కొంతమంది విమర్శలు చేస్తున్నా రోజా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళుతున్నారు.
ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజాను మరో పదవి కూడా త్వరలో దక్కనుందని సమాచారం.వచ్చే ఏడాది జరగబోయే అధికార పార్టీ వైసీపీ కేబినెట్ మార్పుల్లో రోజాను మంత్రి పదవి వరించనుందని తెలుస్తోంది.