బెదిరింపులకు పాల్పడి అడ్డంగా బుక్కయిన వైసీపీ ఎమ్మెల్యే..?? 

పంచాయతీ ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో బలవంతపు ఏకగ్రీవాలను ప్రోత్సహించేది లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సీరియస్ గా చెబుతున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో కొంతమంది నాయకులు తమ నియోజకవర్గాలలో నామినేషన్ వేస్తున్న వారిని బెదిరింపులకు పాల్పడుతున్న పోటీ నుంచి తప్పుకునేలా భయ బ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు.

 Ycp-mla-phone-call-leakedtdp,ysrcp,mla Kanna Babu,atchan Naidu,ap Poltics,phone-TeluguStop.com

ఈ క్రమంలో కొంతమంది నేరుగా దాడి చేయటం మరికొంతమంది ఫోన్ బెదిరింపు కాల్ చేయడం వంటివి ఇటీవల బయట పడిన సందర్భాలు ఉన్నాయి.

టీడీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయం లో బెదిరింపు ఫోన్ కాల్ ఎలా అయితే బయట పడిందో ఇప్పుడు అదే రీతిలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు బెదిరింపు ఫోన్ కాల్ బయట పడటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడికి ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేశారని అభ్యర్థి యొక్క బంధువుల ఆరోపణలు చేస్తున్నారు.నామినేషన్ వేసినందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని ఎమ్మెల్యే బెదిరించినట్లు అభ్యర్థి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా దానికి సంబంధించిన ఆడియో కూడా వినిపించారు.వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు ఆడియో టేప్ బయటపడటంతో అచ్చెనాయుడు పై ఏ విధమైన చర్యలు పోలీసులు తీసుకున్నారో,  అదే రీతిలో కన్నబాబు పై యాక్షన్ తీసుకోవాలని టిడిపి నాయకులతో పాటు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

చట్టం అందరికీ ఒకటే అని అధికార పార్టీకి ప్రతిపక్షానికి మరోలా ఉండకూడదు అని వెంటనే ఎమ్మెల్యే కన్నబాబు పై చర్యలు తీసుకోవాలని  బాబు పేర్కొన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube