జగన్ ప్రధాని కావాలని వాళ్లంతా కోరుకుంటున్నారు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!!

పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల సేవలను కొనియాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో పేద లందరూ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని జగన్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

 Ycp Mla Pardhasaradhi Says They All Want Jagan To Be The Prime Minister-TeluguStop.com

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయని.జగన్ లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే బాగుంటుందని దేశంలో పేదలు భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పార్థసారథి తెలపటంతో.

సభ దద్దరిల్లింది.వైసీపీ కార్యకర్తలు మరియు వాలెంటర్ల్లు చప్పట్లతో మారుమ్రోగించగా అక్కడే ఉన్న జగన్… చిరునవ్వులు చిందించారు.

 Ycp Mla Pardhasaradhi Says They All Want Jagan To Be The Prime Minister-జగన్ ప్రధాని కావాలని వాళ్లంతా కోరుకుంటున్నారు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సెటైర్లు వేశారు.రాష్ట్రంలో సేవలందిస్తున్న రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లను చూసి చంద్రబాబు కోలుకుంటున్నారని, వాళ్లంతా జగన్ సైన్యం.

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ చేస్తున్న పనులు విపక్షాలకు టెన్షన్ పుట్టిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

#YS Jagan #Chandrababu #Volunteers #Pardhasaradhi #JaganAs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు