అన్న ఫోటో కాదు రాజన్న ఫోటో టీడీపీ పరువు పోయిందే     2018-07-17   11:58:39  IST  Sai Mallula

పేదల ఆకలి తీర్చేందుకు వారు మూడు పూటలా అతి తక్కువ ధరకే భోజనం చేసేలా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయలకే భోజనం పధకం ప్రారంభించింది. కాసేపు రాజకీయాలను పక్కనపెడితే నిజంగా ఈ పధకం ద్వారా నిరుపేదలు మూడుపూటలా కడుపునిండా అన్నం తినే అవకాశం దొరుకుతుంది. తెలంగాణాలో ఈ పధకం నాలుగేళ్ళ క్రితమే ప్రారంభించినా టీడీపీ మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొద్దీ రోజుల క్రితమే ప్రారంభించింది. అయితే ఈ ఐదు రూపాయల భోజనం మీద ప్రారంభం నుంచి ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉన్నాయి.

తెలంగాణాలో జి.హెచ్.యం.సి. నిర్వహిస్తున్న క్యాంటీన్ లకు ఏపీలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లకు భోజనం సప్లై చేసేది ఇస్కాన్ కి సంబందించిన అక్షయపాత్ర సంస్థ అయితే తెలంగాణాలో 15/- సబ్సిడీ ఆంధ్రాలో 40/- సబ్సిడీ అంటే బాబు ప్రభుత్వం నలబై రూపాయలు తినేస్తుంది అని ప్రతిపక్షాల వాదన కానీ నిజానికి తెలంగాణాలో నిర్వహిస్తున్న 5/- భోజనానికి, ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లకీ క్వాలిటీ లో తేడా లేదు. అదే అక్షయపాత్ర వారే అందిస్తున్నారు. నిజానికి ఎపి ప్రభుత్వం రోజుకు 40/- సబ్సిడీ ఇస్తున్నారు ఒక భోజనానికి కాదు, అంటే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మూడింటికి కలిపి 40/- సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక భోజనానికి 15/- సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ లో అల్పాహారం, రాత్రి భోజనం కల్పించటం లేదు. కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం అందిస్తుంది.

YCP MLA Opens Rajanna Canteens In AP-

YCP MLA Opens Rajanna Canteens In AP

అన్న క్యాంటీన్ల ప్రచారంలో భాగంగా భారీ హోర్డిండుగులు, పోస్టర్లను విజయవాడతో పాటు రాష్ట్రంలో చాలాచోట్ల పెట్టారు. వాటిలో ఒక ముస్లిం, భుజంపై తువ్వాలేసుకున్న మరో వ్యక్తి కలిసి భోజనం చేస్తున్న ఫొటో ఉంటుంది. ఈ ఫొటో చూడ్డానికి బాగానే ఉంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాబు మీద విమర్శలకు అవకాశమిస్తోంది. చంద్రబాబు సోషల్ మీడియా కోసం ఆరు కోట్లు ఖర్చు పెడుత్నారన్న విషయం తెల్సిందే కదా. ఇప్పుడు కోట్లు పెట్టి దరిద్రం కొనుక్కున్నట్టు ఆ సోషల్ మీడియా టీం చేసిన తప్పుకు ఇంతా కష్టపడి బాబు మాత్రం మాట పడాల్సి వస్తోంది.

ఆ ఫొటోలో ఉన్న లోపం ఏంటంటే ఇది అన్న క్యాంటీన్లో తీసిన ఫొటో కాదు, రాజన్న క్యాంటీన్లో తీసింది. 2017లో, మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న పేరుతో క్యాంటీన్ ప్రారంభించారు. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాంటీన్ అప్పట్లో ఓపెన్ చేశారు. నాలుగు రూపాయిలకే భోజనం అందించారు. ఆ సందర్భంగా తీసిన ఒక ఫోటోని బాబు సోషల్ మీడియా టీం వాడేసింది. సీఎం ట్విట్టర్ మొదలు అన్ని ఖాతాల నుండి ఈ ఫోటో ప్రచారంలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు వచ్చిన క్రెడిట్ మొత్తం పక్కదారి పట్టేసినట్టు అయ్యింది. ఆ ఫోటో ను వాడుకుని వైసీపీ సోషల్ మీడియా బాబు ని ఉతికి ఆరేస్తుండడం , ప్రజల్లో నవ్వులపాలు అవ్వడంతో టీడీపీ డీలా పడింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేదాని మీద ఇప్పడు విచారణ మొదలు పెట్టారు. చేతులు కాలాక ఆకులూ పట్టుకుంటే లాభం ఏముంటుంది..?