కొత్త అవతారమెత్తిన సినీ నటి, ఎమ్మెల్యే రోజా..మగ్గంపై చీరను నేస్తూ?

సీనియర్ హీరోయిన్ రోజా సినిమాలకు దూరంగా ఉన్నా బుల్లితెర షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు జడ్జిగా ఉంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.మరోవైపు ఎమ్మెల్యేగా రోజా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

 Ycp Mla Jabardasth Judge Roja Made Saree With Ap Cm Ys Jagan Design In Nagari-TeluguStop.com

నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజా ఎంతగానో కృషి చేస్తున్నారు.తాజాగా రోజా నేతన్న అవతారం ఎత్తి మగ్గంపై చీరను నేశారు.

రోజా ప్రస్తుతం పాలిటిక్స్ తో పాటు టీవీ షోలను బ్యాలెన్స్ చేస్తున్నారు.

మగ్గంపై జగన్ ఫోటోతో కూడిన చీరను రోజా నేశారు.

నగరి మున్సిపాలిటీలో ఉన్న ఏకాంబరకుప్పం ప్రాంతంలో రోజా పవర్ లూయింగ్ మిషన్లను ప్రారంభించారు.ఆ తర్వాత రోజా తన ఫోటోతో ఉన్న ఉన్న చీరలను కూడా నేశారు.

పవర్ లూమ్స్ మిషన్ల వల్ల వస్త్రాల్లో నాణ్యత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.నూతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ మిషన్లు వస్త్రాల్లో నాణ్యతను కలిగి ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని హిందూపూర్ లో మాత్రమే ఈ టెక్నాలజీ ఉండగా నగరిలో తొలిసారి ప్రవేశపెట్టామని రోజా తెలిపారు.

Telugu Cm Jagan, Jagan, Nagari, Loom, Roja, Ycp Mla, Ycp Mla Roja-Movie

రోజా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు.త్వరలో రోజా మంత్రి అవుతారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

రోజాకు మంత్రిగా అవకాశం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

Telugu Cm Jagan, Jagan, Nagari, Loom, Roja, Ycp Mla, Ycp Mla Roja-Movie

ఆరు నెలల తర్వాత సీఎం జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారని సమాచారం.2024 ఎన్నికల్లో కూడా నగరి నియోజకవర్గంలో రోజా గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.సినిమాల్లో ఆఫర్లు వస్తే రోజా నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి స్పందించి రోజా పలు సందర్భాల్లో స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube