ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఆనందయ్య మందు.. !

కరోనా సమయంలో విపరీతమైన పాపులారిటీ సాధించుకున్న వ్యక్తి ఎవరంటే ఆనందయ్య అని టక్కున చెప్పవచ్చూ.ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ రాకుంటే ఆనందయ్య లాంటి వైద్యుడు వెలుగులోకి రాకపోయి ఉండవచ్చు.

 Ycp Mla Chevireddy Bhaskar Reddy Troubled With Anandayya Corona Medicine-TeluguStop.com

కాగా కరోనా వైరస్ కు ఆనందయ్య మందు పక్కాగా విరుగుడు అనే ప్రచారం ప్రజల్లో విపరీతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆనందయ్య మందుకు ఇంతలా పాపులారిటీ రావడం వెనక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది.

 Ycp Mla Chevireddy Bhaskar Reddy Troubled With Anandayya Corona Medicine-ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఆనందయ్య మందు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తన నియోజకవర్గ ప్రజల కోసం చెవిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్యను, ఇతని అనుచరులను చంద్రగిరి తీసుకొచ్చి మందు తయారీ చేపట్టారు.ఇక ఆ మందు డబ్బాల పై చెవిరెడ్డి ఫొటోలు ముంద్రించుకుని తన నియోజక వర్గంలో పంపిణి చేస్తున్నాడట.

ఈ క్రమంలో నియోజకవర్గంలో పాజిటివ్‌ టాక్ వచ్చినా.పబ్లిసిటీ మాత్రం తలనొప్పిగా మారిందట.

ఈ నేపధ్యంలో చెవిరెడ్డికి ఏపీలోని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నేతలు, చివరికి తెలంగాణ నుండి కూడా ఫోన్ చేసి తమకు ఆనందయ్య మందు కావాలని ఫోన్లు వస్తున్నట్టు సమాచారం.ఇక పోలీసులు ఇతర ప్రభుత్వ అధికారుల నుంచి కూడా ఇదే సమస్య ఎదురవుతుందట.

ఇక ఈ మందు పంపిణీ 50 లక్షల్లో అయిపోతుందని భావించిన చెవిరెడ్దికి మందు తయారీ మొదలుపెట్టాక ఖర్చు లక్షల నుంచి కోట్లల్లోకి పెరిగిందట.దీంతో ప్రస్తుతం ఆనందయ్య మందు ఈ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నట్లుగా సమాచరం.

#AP MLA #Corona Virus #Phone Calls #Chevireddy #ChandraGiri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు