వైసీపీ మంత్రులను భయపెడుతున్న మాజీ మంత్రి లోకేష్  

Ycp Ministers Afraid Of Lokesh-

అదేంటి అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులను మాజీ మంత్రి,టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ భయపెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా, విషయం ఉందండీ.అదేంటంటే ఏపీ సచివాలయంలో మంత్రులకు చాంబర్స్ ని కేటాయించారు.ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందికి సచివాయలం లో చాంబర్స్ కేటాయించగా, దానిలో 5 వ బ్లాక్ లోని ఛాంబర్ ను మాత్రం ఏ ఒక్క మంత్రి కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరట.దానికి కారణం అది గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ఛాంబర్ కావడమే.

Ycp Ministers Afraid Of Lokesh--YCP Ministers Afraid Of Lokesh-

నారా లోకేష్ ఛాంబర్ అనగానే అందరూ పారిపోతున్నారట.ఆ ఛాంబర్ మాకొద్దంటే మాకోద్దంటూ ఇప్పటికి నలుగురు మంత్రులు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసి దారుణంగా ఓటమి పాలవ్వడం,అలానే ఆయన పై పప్పు అన్న ముద్రను చెరుపుకోలేకపోవడం ఇలా అన్ని కలగలిసి ఆయన ఛాంబర్ మాకొద్దంటే మాకోద్దంటూ మంత్రులు తప్పుకుంటున్నారట.

Ycp Ministers Afraid Of Lokesh--YCP Ministers Afraid Of Lokesh-

దీనితో వైసీపీ మంత్రులను లోకేష్ బాగా భయపెట్టేసారట.దీనితో 5 వ బ్లాక్ లో ఉన్న ఆయన ఛాంబర్ ను ఏ మంత్రి తీసుకోవడానికి ముందుకు రాకపోవడం తో ఇక ఈ విషయంలో ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే టట్లు కనిపిస్తుంది.లేదంటే ఆ ఛాంబర్ అలానే మిగిలిపోయేలా కనిపిస్తుంది.మరి జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆ ఛాంబర్ ను ఎవరికీ కేటాయిస్తారా చూడాలి.