పవన్ చదవాల్సింది పుస్తకాలు కాదా ? న్యూస్ పేపర్లా ?

రాజకీయ నాయకులు చెప్పే మాటలకు ఇచ్చే స్టేట్మెంట్లు ఒక విలువ ఉంటుంది.వాటి ఆధారంగా వారి రాజకీయంగా వారు పైమెట్టు ఎక్కవచ్చు లేక దిగావచ్చు.

 Vellampalli Srinivas Rao, Pawan Kalayan, Janasena, Ycp Minister Comments On Pawa-TeluguStop.com

అందుకే స్టేట్ మెంట్ లు ఇచ్చే ముందు కాస్త వెనక ముందు చూసుకుంటే, ఎటువంటి ఇబ్బందులు ఉండవు.అలా కాకుండా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే ఆ తరువాత అనవసర తల నొప్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పుడు అటువంటి ఇబ్బందుల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటూ విమర్శల పాలవుతున్నారు.ఏపీ ప్రభుత్వం అర్చకులకు, పాస్టర్లకు, ఇమామ్ లకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ నిర్ణయం వెలువడిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ విషయంపై ప్రకటన చేశారు.ఏపీలో అర్చకులను ఆదుకోవాలని లాక్ డౌన్ సమయంలో వారు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం చాలా రోజులు అయింది.వీరందరికీ సహాయం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అన్ని టీవీ ఛానళ్లలోనూ, పత్రికల్లోనూ వచ్చింది.అయినా పవన్ మాత్రం ఆ విషయం తెలియకుండానే తాఫీగా స్టేట్మెంట్ ఇవ్వడంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పవన్ పై సెటైర్ వేశారు.

అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ వాయిస్తారు ఏంటి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి తగిన విధంగా స్పందించాల్సిన జనసేన అధినేత ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఆ పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ ను మరింతగా అభాసుపాలు చేస్తోంది.

Telugu Janasena, Pawan Kalayan, Ycp Pawan-Telugu Political News

వాస్తవంగా పవన్ తాను నిత్యం పుస్తక పఠనం చేస్తానని వేలల్లో బుక్స్ చదవానని ఇప్పటికే ప్రకటించుకున్నారు.ఇక ఇప్పుడు వైసీపీ నాయకులు మాత్రం పవన్ చదవాల్సింది పుస్తకాలను కాదని, దినపత్రికలేనని, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు.కేవలం వైసీపీ మీద విమర్శలు చేయడానికి తాను పార్టీ స్థాపించాను అనే విధంగా పవన్ వ్యవహరిస్తున్న తీరు ఆయనను విమర్శల పాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube