వైసీపీ మంత్రికి ఇంటిపోరు.. ఆ వ‌ర్గానికే పెద్దపీట వేస్తున్నారంట‌..

వైసీపీ ఇప్పుడు తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.అన్ని పార్టీల్లోనూ ఇంటిపోరు ఉంది కానీ వైసీపీలో పెద్ద‌గా లేద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

 Ycp Minister Troubling In Party They Are Giving Huge Preference To That Category-TeluguStop.com

కానీ వాస్త‌వానికి విష‌యం మాత్రం వేరేలా ఉంది.అదేంటంటే చాలా జిల్లాలో ఎమ్మెల్య‌ల‌కు మంత్రుల‌కు అలాగే ఎంపీల‌కు అస్స‌లు ప‌డ‌ట్లేదు.

ఆధిప‌త్యం కోసం బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇప్ప‌టికే రాజ‌మండ్రి, నెల్లూరు లాటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ఇంటిపోరు బ‌య‌ట‌ప‌డింది.

కాగా ఇప్పుడు ఓ మంత్రికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే దారుణ‌మైన అవ‌మానం జ‌రిగింది.అయితే ఇది కూడా సొంత పార్టీ వ‌ల్ల‌నే అని ఆరోపిస్తున్నారు.అదేంటంటే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన‌టువంటి మంత్రి కన్నబాబు ఈ మ‌ధ్య యాక్టివ్ రాజ‌కీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు.కాగా ఆయ‌న రీసెంట్ గా రాయుడుపాలెంలో గ్రామ పంచాయ‌తీ ఓపెనింగ్ ప్రోగ్రామ్‌కు వెల్లారు.

అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు వైసీపీ నేతల నుండే చేదు అనుభవం ఎదురవ‌డం క‌ల‌కలం రేపింద‌నే చెప్పాలి.ఈ ప్రోగ్రామ్‌కు వెళ్లిన మంత్రి కన్నబాబును స్వ‌యంగా వైసీపీ కార్యకర్తలే అడ్డుకోవ‌డం సంచ‌ల‌నం రేపింది.

Telugu Bc Category, Jagan, Kannababu Ycp, Kannababu, Rayudupalem, Ycp-Telugu Pol

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్న‌బాబు కేవ‌లం ఆ వ‌ర్గానికి మాత్ర‌మే పెద్ద పీట వేస్తున్నార‌ని బీసీల‌కు అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.తాము ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన మంత్రి ఇలా త‌మ‌ను మాత్రం ప‌ట్టించుకోకుండా కేవ‌లం కాపు సామాజిక వర్గానికి మాత్ర‌మే అనుకూలంగా ఉంటున్నారంటూ తీవ్ర నిర‌స‌న తెలిపారు.దీంతో చేసేది లేక మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.ఇలా సొంత జిల్లా కార్య‌క‌ర్త‌లే ఆయ‌న్ను ఇలా తీవ్రంగా వ్య‌తిరేకించ‌డాన్ని ఆయ‌న స‌హిచ‌లేక‌పోతున్నారు.ఏదేమైనా ఈ మ‌ధ్య వైసీపీలో ఇలా వ‌ర్గాల వారీగా నిర‌స‌న‌లు వెల్ల‌డ‌వుతున్నాయి.మ‌రి ఆయ‌న ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube