చంద్రబాబు ని కూడా అరెస్టు చేస్తామంటున్న వైసీపీ మంత్రి..!!  

Tdp,Ysrcp,janasena,bjp,vellampalli srinivas,chandrababu, vellampalli srinivas sensational comments on chandrababu naidu - Telugu Bjp, Chandrababu, Janasena, Tdp, Vellam Palli Srinivas, Vellampalli Srinivas, Vellampalli Srinivas Sensational Comments On Chandrababu Naidu, Ysrcp

ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

TeluguStop.com - Ycp Minister To Arrest Chandrababu Too

విగ్రహాల ధ్వంసం చేసి ప్రభుత్వంపై కుట్రపన్ని.వైసిపి పార్టీని ఒక మతానికి అంటగట్టి పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

TeluguStop.com - చంద్రబాబు ని కూడా అరెస్టు చేస్తామంటున్న వైసీపీ మంత్రి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

2014వ సంవత్సరంలో టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే.

కాగా 2016లో వారి హయాంలోనే దాదాపు నలభై దేవాలయాలు అర్ధరాత్రి చంద్రబాబు సర్కార్ కూల్చేయడం జరిగిందని.అది ప్రభుత్వం చేసిన కుట్ర అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం అనేది వైసీపీ ప్రభుత్వం పై జరుగుతున్న కుట్ర అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ప్రభుత్వంలో ఉన్న పార్టీ కావాలని రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలని ప్రయత్నాలు చేయదు.

అన్ని ప్రభుత్వాలు సాత్విక పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాయి.ప్రతిపక్షాలకే అశాంతి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో ఉంటాయి.

ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మాట్లాడటానికి అవకాశం లేక.ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని ఒక మతానికి అంటగట్టడానికి బాబు ఆడుతున్న డ్రామా అని.పేర్కొన్నారు.విగ్రహాల ధ్వంసం అనే ఘటన లో చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా దొరికితే కచ్చితంగా అరెస్టు చేస్తామంటూ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

#Chandrababu #Janasena #Ysrcp #VellamPalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు