బాబు, లోకేష్ ల పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రి..!!

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై హరికృష్ణ ఆయన కుమారుడు లోకేష్ పై మండిపడ్డారు.ప్రతి విషయానికి ఇద్దరూ రాద్ధాంతం చేస్తున్నారు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Ycp Minister Made Serious Remarks On Babu And Lokesh-TeluguStop.com

ఇలా ఉంటే తూర్పు గోదావరి జిల్లా లో వైరస్ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో .బోటింగ్ కార్యక్రమం జులై నుండి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందే రీతిలో పర్యాటకుల కోసం విదేశీ మద్యం అందుబాటులోకి తెచ్చినట్లు .విదేశీ మద్యం అమలుపై క్లారిటీ ఇచ్చారు.

దాదాపూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో టూరిస్టుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంటుందని .ఆ తరహాలోనే రాష్ట్రప్రభుత్వం ఆలోచించి విదేశీ పర్యాటకుల కోసం విదేశీ మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.అయితే ఈ విషయంపై కొంతమంది పొలిటికల్ మైలేజ్ సంపాదించడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని పర్యాటక రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు.అబద్దాలు మాయమాటలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని విమర్శించారు.

 Ycp Minister Made Serious Remarks On Babu And Lokesh-బాబు, లోకేష్ ల పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే రీతిలో కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన లోకేష్ హైదరాబాద్ ఇంట్లో కూర్చున్నాడని సెటైర్లు వేశారు.ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

#Ap Tourisum #Lokesh #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు