స్క్రిప్ట్ రాస్తే పవన్ చదువుతాడు అంటూ వైసీపీ మంత్రి డైలాగులు..!!  

kodali nani,pawan kalyan,ysrcp,gudiwada - Telugu Gudiwada, Kodali Nani, Pawan Kalyan, Ysrcp

ఇటీవల వైసీపీ మంత్రి కొడాలి నాని ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి… నియోజకవర్గంలో రోడ్లు వేయలేని దుస్థితి అంటూ చేసిన కామెంట్లపై కొడాలి నాని ని ప్రశ్నించారు.

మంత్రి కొడాలి నాని దీనికి సమాధానం ఇస్తూ… చంద్రబాబు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో 10 కోట్లు కూడా ఇవ్వలేదని, అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన టాప్, ఆయన మరో పది సంవత్సరాలు పరిపాలించాలని కోరుకోవడం జరిగింది అని తెలిపారు.

కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు సంవత్సరాల అవ్వకుండానే దాదాపు గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి 100 కోట్లు నిధులు ఇవ్వటం జరిగిందని, కొత్త బస్టాండ్ కోసం 22 కోట్లు అదేవిధంగా హాస్పిటల్ కోసం పది కోట్లు నిధులు మంజూరు చేసిన ఘనత వైసిపి పార్టీ అని ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని మాట్లాడటం హాస్యాస్పదం అని కొడాలి నాని పేర్కొన్నారు.స్క్రిప్ట్ రాసిస్తే చదివే వాడు పవన్ కళ్యాణ్ అంటూ భారీ డైలాగులు వేశారు.

#Pawan Kalyan #Gudiwada #Ysrcp #Kodali Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు