కేంద్రమంత్రికి కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..!!

Ycp Minister Counter To Central Minister

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ ప్రాంతంలో.కొన్ని ప్రాజెక్ట్ లు డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే.

 Ycp Minister Counter To Central Minister-TeluguStop.com

ఈ క్రమంలో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోయి.తీవ్ర ప్రాణ ఆస్తినష్టం జరిగింది.

అయితే ఈ సంఘటన ఉద్దేశించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.ముమ్మాటికీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ycp Minister Counter To Central Minister-కేంద్రమంత్రికి కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించి కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడినవని విమర్శించారు.

ప్రాజెక్ట్ ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని అన్నారు.ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు 150 మంది జల సమాధి అయ్యారనీ, అయితే అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కనుక నిజాలు దాచే ప్రయత్నం చేశారని అనిల్ కుమార్.వైరల్ కామెంట్ చేశారు.కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యల వెనక తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు ఉందని… సీఎం రమేష్, సుజనా చౌదరి ఆయనకు టీడీపీ స్క్రిప్టు ఇప్పించి చదివించారు అన్నట్టు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

#Ycp Central

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube