టీడీపీకి ఛాలెంజ్ విసిరిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్..!!

Ycp Minister Avanti Srinivas Throws Challenge To Tdp

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల పై దాడులు జరగడం తో.

 Ycp Minister Avanti Srinivas Throws Challenge To Tdp-TeluguStop.com

చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపడితే ఉండగా.మరోపక్క వైసీపీ పార్టీ నేతలు.సీఎం జగన్ కి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా.“జనగ్రహ” దీక్షలు చేపడుతున్నారు.ఇటువంటి తరుణంలో డ్రగ్స్ సరఫరా అంటూ.చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల… విశాఖలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ స్పందించారు.సాక్షాత్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన క్యాబినెట్ లో.ఇద్దరు మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారని పేర్కొన్నారు.

మంత్రి అయ్యన్నపాత్రుడు గంజాయి స్మగ్లర్ అని అప్పట్లో అదే క్యాబినెట్ కు చెందిన మరొక మంత్రి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.అటువంటి స్మగ్లర్లను చుట్టుపక్కల పెట్టుకున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని.

 Ycp Minister Avanti Srinivas Throws Challenge To Tdp-టీడీపీకి ఛాలెంజ్ విసిరిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్కడో షిప్ దొరికింది.దానికి ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టే రీతిలో .చంద్రబాబు ఆరోపణలు చేయటం దారుణమని అన్నారు.స్వయంగా కేంద్రమే ఏపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

దమ్ముంటే నిరూపించండి.? నిజమైతే.రాజకీయాల నుండి తప్పుకుంటా అని మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ కి చాలెంజ్ విసిరారు.

#Ayyannaptrudu #Avanti Srinivas #Jagan #YCPAvanthi #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube