టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి( Ambati Rambabu ) హెచ్చరిక.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై( TDP MLAs ) వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.‘మీరు కాగితాలు చించి స్పీకర్( Speaker ) మీద వేయడం మర్యాద కాదు.అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం.
ఇది సభకు అవమానకరం.మీరు సభా సంప్రదాయాలు తప్పితే.మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది.సభలో ఉంటారా? మార్షల్స్తో నెట్టించుకుంటారా? అనేది మీ ఇష్టం.కానీ విలువైన సమయాన్ని వృథా చేయవద్దు’ అని అన్నారు.







