టీడీపీ చేసిన తప్పే వైసీపీ చేస్తోందా ?  

Ycp Made In Village Volunteers-chandrababu Naidu,jagan Mohan Reddy,janmma Bhoomi,tdp,village Volunteers,ycp

ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన జనరంజకంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన కొద్దీ రోజుల్లోనే రికార్డు స్థాయిలో పధకాలను అమలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు జగన్. అంతే కాదు ఏపీలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను కూడా తొలగించేందుకు కూడా లక్షల కొద్దీ ఉద్యోగాల భర్తీకి పూనుకున్నాడు..

టీడీపీ చేసిన తప్పే వైసీపీ చేస్తోందా ? -Ycp Made In Village Volunteers

ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య కూడా ఇక్కడే మొదలయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జగన్ గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసాడు. వారి ద్వారా రేషన్,పింఛన్ల పంపిణి, ప్రభుత్వ పథకాలు ఇలా ఎన్నో వాటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసాడు.

వారి ఎంపికలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇక్కడ గతంలో టీడీపీ చేసిన తప్పులే ఇప్పుడు వైసీపీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయితే ఆ పార్టీని దెబ్బతీశాయో తెలియంది కాదు.జన్మభూమి కమిటీల ఆగడాలకు ప్రజలంతా విసుగుచెందారు.

ఆ ఎఫెక్ట్ తీవ్రం అవ్వడం ఆ ప్రభావం తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్ల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తయ్యింది. ప్రస్తుత గ్రామ వాలంటీర్ల వ్యవస్థకూ, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల నియామకాలకూ మధ్య పొంతన లేనప్పటికీ టీడీపీ మాదిరిగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు జరుగుతుండడం రకరకాల ఊహాగానాలకు కారణం అవుతోంది..

గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను నియమించింది. ప్రభుత్వం నేరుగా జన్మభూమి కమిటీలకు ఆయా పథకాలకు లబ్ధిదారుల పంపిక బాధ్యత అప్పగించింది. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు చేసేదిలేక ప్రేక్షకపాత్ర వహించారు. అప్పటి అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో జన్మభూమి కమిటీలు నడిచేవి, వారు చెప్పినవారికి తప్ప మిగతా వారు ఎవరికీ ప్రయోజనాలు దక్కలేదు.

ప్రభుత్వ గృహాల కేటాయింపు, ఇళ్ళపట్టాలు, సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ వంటివి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలదే అంతిమ నిర్ణయం. ఇది ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమిస్తోంది..

ఈ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని జగన్‌ ప్రకటించినప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతుండడం, పార్టీ నాయకులు చెప్పినవారి పేర్లే లిస్ట్ లో ఉండడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది.