ఆయనతో జాగ్రత్తండోయ్ ! జగన్ ను హెచ్చరిస్తున్న సన్నిహితులు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ఇద్దరూ ఎంత సన్నిహితుల్లో చెప్పనవసరం లేదు.ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉండడంతో వీరి స్నేహం మరింత బలపడిందనే చెప్పాలి.

 Ycp Leaderssuggestion To Jagan Takecarefrom Kcr-TeluguStop.com

అదే స్నేహంతో ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ అన్నివిధాలా సహాయ సహాకారాలు కేసీఆర్ అందించాడు.కేసీఆర్ నుంచి ఆర్ధిక సహాయం కూడా వైసీపీకి అందింది అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.

ఏది ఏమైనా ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు సీఎంలుగా తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నారు.కేసీఆర్ ను జగన్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కేసీఆర్ పదే పదే జగన్ పొగుడుతుండడం కూడా జగన్ మీద విమర్శలు చెలరేగాడు కారణం అవుతోంది.

-Telugu Political News

అయితే కేసీఆర్ గురించి జగన్ ఎంత పొగిడినా జగన్ గురించి పొగిడేందుకు కేసీఆర్ మాత్రం పెద్దగా మొగ్గు చూపడంలేదని చెప్పాలి.అసెంబ్లీలోనూ జగన్ ప్రస్తావన పెద్దగా తీసుకురావడం లేదు.అయితే దీనికి భిన్నంగా జగన్ మాత్రం అక్కడా ఇక్కడా అని లేకుండా కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆ పొగడ్తలు అసెంబ్లీ రికార్డులలో కూడా నమోదయిపోతున్నాయి.అయితే కేసీఆర్ జగన్ స్నేహం ప్రస్తుతానికి ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతున్నా ముందు ముందు కేఈసీఆర్ వైఖరిలో మార్పు వస్తే అప్పుడు జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవన్నీ జగన్ కు ముందు ముందు ముందరికాళ్ల బంధంలా తయారవుతాయని చెప్పుకోక తప్పదు.

కేసీఆర్ రాజకీయ జీవితం ఒకసారి పరిశీలిస్తే ఆయన టీడీపీలో రాజకీయంగా పెరిగారు.

ఆ తరువాత ఆ పార్టీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు.కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేసిన కేసీఆర్ సోనియాని దేవత అని పొగిడి ఆ తరువాత దెయ్యం అన్నారు.

అంతే కాదు ఇప్పుడు కాంగ్రెస్ ని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.వీటన్నిటిని పరిశీలించే జగన్ కు అత్యంత సన్నిహితులు కొంతమంది ఇప్పుడు జగన్ ను కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఆయన్ను అతిగా పొగడడం వల్ల ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అప్పుడు ఇంతా పశ్చాతాపం పడినా లాభం ఉండదంటూ హితబోధ చేస్తున్నారట.అయితే ఈ విషయాలను జగన్ చెవికెక్కించుకుంటారా లేక వదిలేస్తారా అనేదానిపైనే ముందు ముందు పరిణామాలు ఆధారపడి ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube