వైసీపీ లో పవన్ భయం పెరిగిందా ? ఈ సవాళ్లు అందుకేనా ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భయం పెరిగినట్టుగా కనిపిస్తోంది.జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగాలు, సవాళ్లు అన్ని వైసీపీ ని టార్గెట్ చేసుకుని ఉండడం, వైసిపి మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని,  దాని కోసం ఏం చేసేందుకైనా సిద్ధం అంటూ చేసిన ప్రకటనలు అంతర్గతంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

 Ycp Leaders Worried About Tdp Janasena Alliance Details, Pavan Kalyan, Janasenan-TeluguStop.com

ఇప్పటివరకు జనసేన ఒంటరిగానే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందని,  టిడిపి బలహీనంగా ఉంది కాబట్టి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలో ఉంటూ వచ్చారు వైసీపీ ముఖ్య నాయకులు.

కానీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చడం తనకు ఇష్టం లేదని , అందుకే వైసీపీ వ్యతిరేక పార్టీలన్నితితోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.

టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.అలాగే బిజెపితోనే పొత్తు కొనసాగిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ అర్థమయ్యేలా పవన్ చెప్పారు.

పవన్ ప్రసంగం పూర్తి కాగానే వైసీపీ కీలక నాయకులు అంతా మీడియా సమావేశాలు నిర్వహించారు.ఒక్కొక్కరుగా జనసేన టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.

ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినా,  వాటిపై స్పందించకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే… ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ సవాళ్లు విసిరారు.వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి జనసేన బీజేపీ కాంబినేషన్ లో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తమకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాన్ని వైసీపీ ఎప్పుడో గుర్తించింది.అందుకే చాలాకాలంగా టిడిపి పార్టనర్ పవన్ కళ్యాణ్ అంటూ పదే పదే విమర్శలు చేస్తూ వచ్చేవారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తారని అనేక విమర్శలు చేశారు.అయినా వాటిని పట్టించుకోకుండా పవన్ ఇప్పుడు పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామనే విషయాన్ని బయట పెట్టడం వైసీపీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అందుకే మంత్రి పేర్ని నాని , కొడాలి నాని వంటి వారితో పాటు , వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు చాలామంది జనసేన ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.మొదటి నుంచి తాము చెప్పిందే జరిగిందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని , అందుకే పొత్తులతో తమను ఎదుర్కోవాలని చూస్తున్నారు తప్ప, ఒంటరిగా పోటీ చేసి తమ సత్తా ఏమిటో నిరూపించలేక పోతున్నారు అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

Ycp Leaders Worried About Tdp Janasena Alliance Details

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube