జ‌గ‌న్ మెప్పు పొందిన మంత్రులు ఎంద‌రు..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏపీని పాలిస్తున్నారు.

 Ycp Leaders Tension Over Ys Jagan Cabinet Expansion, Ys Jagan, Ycp Leaders, Ap C-TeluguStop.com

కాగా, పాలనలో తనదైన ముద్ర వేసేందుకుగాను జగన్ తన కేబినెట్‌ను రెండేళ్ల తర్వాత పూర్తిగా మారుస్తానని చెప్పారు.హాఫ్ టర్మ్ కాగానే అందరూ దిగిపోవాల్సిందేనని కండీషన్ కూడా పెట్టాడు.

ఈ క్రమంలోనే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతున్నది.

చాలా కాలం నుంచి వైసీపీ వర్గాల్లో మంత్రి వర్గ విస్తరణ గురించి డిస్కషన్ జరుగుతున్నది.

అయితే, కొవిడ్ మహమ్మారి వల్ల విస్తరణ ఆలస్యమైందని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.కాగా, ఇప్పుడు తన కేబినెట్‌లో ఉన్న పాతిక మంది మంత్రులలో ఎంత మంది జగన్ మెప్పు పొందారనేది తాజాగా చర్చనీయాంశమవుతున్నది.

జగన్ మెప్పు పొందిన వారికి కేబినెట్‌లో ఎక్స్‌టెన్షన్ ఛాన్స్ ఉంటుందని టాక్.

Telugu Ap, Jagan, Ycp, Ys Jagan-Telugu Political News

గతంలో చెప్పినట్లు మొత్తం కేబినెట్‌ను మార్చేందుకు జగన్ మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.అలా చేస్తే రాజకీయంగా తనకే నష్టం జరుగుతుందని అంచనా వేసుకుని. కేబినెట్ విస్తరణను ఆలస్యం చేస్తున్నారని వినికిడి.

మంత్రుల పనితీరును బట్టే వారికి కేబినెట్‌లో కొనసాగే అవకాశాలుంటాయని చర్చ జరుగుతున్నది.సీనియర్ మంత్రులతో పాటు కొత్తగా మంత్రి పదవి తీసుకున్న వారిలో ఎఫెక్టివ్‌గా పని చేసిన వారికి కంపల్సరీగా ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇకపోతే మంత్రి వర్గ విస్తరణ, కూర్పులో ఇప్పటికే జగన్ తనదైన శైలి సామాజిక రాజకీయ సమీకరణాలను పాటిస్తున్నారు.భవిష్యత్తులోనూ అటువంటి పరిస్థితులు కొనసాగేలా చూస్తారట.

మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్‌ను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతూనే నష్ట నివారణ చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.చూడాలి మరి… జగన్ తన కేబినెట్‌ను ఎప్పుడు విస్తరిస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube