జగన్ నమ్మలేని నిజాలు : వైసీపీలో అసమ్మతి కి కారణం వారే ?

జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది అంటూ దేశవప్తంగా పేరు మార్మోగిపోతోంది.చాలా రాష్ట్రాలు జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ, ఆయనను అనుసరిస్తున్నాయి.

 Tdp Migrants, Ycp Party, Ys Jagan, Ycp Leaders, Tdp Migrants Reason For Criticiz-TeluguStop.com

ఏపీలో ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను తమ తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నాయి.కేంద్రం కూడా జగన్ నిర్ణయాలకు ఫిదా అవుతోంది.

బయట జగన్ కు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇంటి పోరు మాత్రం ఎక్కువైంది.ప్రభుత్వ విధానాలను, పథకాలను, జగన్ తీరును విమర్శిస్తూ పెద్దఎత్తున సొంత పార్టీ నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తూ ఉండడం, పదే పదే ఈ విషయాలపై నేతలకు వార్నింగ్ లు ఇస్తున్నా, పట్టించుకోకుండా, అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతూ జగన్ కు ఆగ్రహాన్ని కలిగిస్తున్నారు.

ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై చేసిన విమర్శలు కలకలం రేగడంతో పాటు, సంచలనం సృష్టించాయి.

అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సైతం ఇదే విధంగా అసమ్మతి రాగం వినిపించడంతో, మరికొంతమంది ఎమ్మెల్యేలు మీడియా ముందు ఇదే రకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు.

ఇవన్నీ కొద్ది రోజులుగా వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి.అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, సొంత పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శలు చేయడానికి కారణం ఏమిటనే విషయంపై జగన్ ఆరాతీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ప్రస్తుతం విమర్శలు చేస్తున్న నాయకులు టిడిపి నుంచి వలస వచ్చిన వారే అని, వారు టీడీపీ నుంచి వైసిపి లో చేరితే, రాజకీయంగా ఎదురే ఉండదని, తనకు కీలక పదవులు కట్టబెడుతున్నారని ముందుగానే ఆశించి పార్టీలో చేరారు.

Telugu Tdp, Ycp, Ys Jagan-Telugu Political News

కానీ ఇక్కడ జగన్ సామాజిక వర్గాల వారీగా పదవులు కట్టబెడుతున్నారని, ఎంతో ఆశతో వలస వచ్చిన నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది.వైసిపిలో చేరినా, తమకు ఆనందం ఏమీ లేదని, పైగా నియోజకవర్గాల్లో తాము చేసేందుకు కూడా అవకాశం లేకుండా, మొత్తం పరిపాలన అధికారులు చేతుల్లో పెట్టడం తో తమను డమ్మీలుగా మార్చేశారనే అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వచ్చేసింది.అందుకే ఆ అసంతృప్తి మీడియా ముందు బయట పెట్టుకుంటూ, ఆ విషయం తన వద్దకు వెళ్లే విధంగా చేస్తున్నారని జగన్ కూడా గ్రహించారు.

అందుకే ఇప్పటికే పార్టీ మూడు ప్రాంతాలుగా విభజించి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకు బాధ్యతలు అప్పగించారు.ఇప్పుడు అసమ్మతి రాగం వినిపిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పార్టీ అధినేతనే ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనే సంకేతాలు ఇవ్వాలని జగన్ తాజాగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

ముందుగా అసమ్మతిరాగం మొదలుపెట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయిస్తే, నాయకులు నోళ్లు మూతపడతాయనే విధంగా జగన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube