ఆ వైసీపీ సీనియ‌ర్ టార్గెట్‌గా పార్టీలో ఏం జ‌రుగుతోంది..!  

మంత్రి ప‌దవి ద‌క్కించుకోవాలి.మంచిమార్కులు వేయించుకోవాలి.

TeluguStop.com - Ycp Leaders Targets Dharmana Prasad Rao

ఇదీ.శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.నిశిత దృష్టి.సునిశిత విశ్లేష‌ణ, స‌ద్విమ‌ర్శ‌కు ఆయ‌న పెట్టింది పేరు.

అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతుంటే.ప్ర‌తిప‌క్షం వాళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తాయ‌నే పేరు కూడా తెచ్చుకున్నారు.

TeluguStop.com - ఆ వైసీపీ సీనియ‌ర్ టార్గెట్‌గా పార్టీలో ఏం జ‌రుగుతోంది..-General-Telugu-Telugu Tollywood Photo Image

మంచి పొలిటీషియ‌న్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నుంచి వ‌చ్చి.

ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని ఆశించారు.అయితే.ఇది అనూహ్యంగా ఆయ‌న అన్న కృష్ణ‌దాస్‌కు ద‌క్కింది.కానీ.

ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న‌ప్ప‌టికీ.రాజ‌కీయంగా ప్ర‌సాద్ వ్యూహం వేరు దాస్ వ్యూహం వేరు.

దీంతో ప్ర‌సాదరావులో అసంతృప్తి అలానే ఉంది.ఇక‌, రెండున్న‌రేళ్ల‌లో ఎలాగూ మంత్రివ‌ర్గం పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఉంటుంది క‌నుక త‌న‌కు ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అనుకున్నారు ప్ర‌సాద‌రావు.

కానీ, ఆయ‌న జిల్లాల ఏర్పాటుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్‌కు రిపోర్టులు అందాయి.

ఆయ‌న‌పై సానుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ.ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను స‌హించేది లేద‌ని జ‌గ‌న్ చెప్పార‌ని అంటున్నారు.ఈ క్ర‌మంలోనే ఇదే జిల్లాకు చెందిన పాత‌పట్నం ఎమ్మెల్యేరెడ్డి శాంతి పేరు ప‌రిశీలిస్తున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వైఎస్ కుటుంబానికి ఎంతో విధేయురాలిగా పేరున్న ఆమెను కేబినెట్‌లో తీసుకునేందుకు ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని అంటున్నారు.వ‌చ్చే ఏడాదిచివ‌ర‌లో మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో ప్ర‌సాద‌రావు ఆశ‌లు అడియాస‌లు కావ‌డం ఖాయ‌మ‌నే టాక్ అప్పుడే వ‌చ్చేసింది.

పైగా ఇదే జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కూడా మా నాయ‌కులే ఇక్క‌డ పెద్ద స‌మ‌స్య‌గా మారారంటూ.ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల వెనుక ప్ర‌సాద‌రావును ఉద్దేశించే అయి ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మొత్తానికి ప్ర‌సాద‌రావు ఆశ‌లు నెర‌వేర‌తాయో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సందే.

#YCPSenior #YCPLeaders #Jagan Cabinet #Political War #Appalraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు