మంత్రి ప‌ద‌వుల కోసం అక్క‌డ‌కు క్యూ క‌డుతున్న వైసీపీ నేత‌లు..

మంత్రి ప‌ద‌వి అనేది ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యేకు పెద్ద క‌ల‌.ఎలాగైనా క‌నీసం ఒక్క‌సారైనా మంత్రి కావాల‌ని ప్ర‌తి ఎమ్మెల్యే కోరుకుంటారు.

 Ycp Leaders Queuing Up For Ministerial Posts.., Ycp Leaders, Ap Politics,ap News-TeluguStop.com

అందుకోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటారు.ఇప్పుడు వైసీపీలో ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

ఎమ్మెల్యేలు అంద‌రూ మంత్రి ప‌ద‌వుల కోసం ఎన్నో పాట్లు ప‌డుతున్నారు.జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేండ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా మార్పు ఉంటుంద‌నే ఊహాగానాలు మిన్నంటాయి.

దీంతో అంద‌రూ ఎలాగైనా ఈసారి త‌మ‌కు అవ‌కాశం వ‌చ్చుడు ఖాయ‌మ‌నే న‌మ్మ‌కంతో నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇన్ని రోజులు అధినాయ‌కులు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన ఎమ్మెల్యేలు ఎలాగైనా జ‌గ‌న్ మెప్పు పొందాల‌ని బాగానే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు.

అయితే ఇప్పుడు రూటు మార్చిన‌ట్టు తెలుస్తోంది.రాజ‌కీయ నాయ‌కుల‌కు సాధార‌ణంగా భ‌క్తి కొంచెం ఎక్కువే ఉంటుంది.అధికారం చాలా ర‌కాల మొక్కులు చెల్లిస్తుంటారు.అలాంటి ఓ చోట‌కు వెళ్తే అధికారం వ‌స్తుందంటే అక్క‌డ‌కు వెళ్ల‌కుండా ఉంటారా ఇప్పుడు వైసీపీ నేత‌లు కూడా ఇలాగే చేస్తున్నారు.

ఇప్పుడు వైసీపీ నేత‌లు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.

Telugu Ap Ministers, Ap, Cm Jagan, Ycp, Ycp Ministerial, Ysrcp-Telugu Political

విజయనగరం జిల్లాలో ఉండేట‌టువంటి మక్కువ మండలానికి చెందిన‌టువంటి పాపయ్య వలస ఊరుకు ఇప్పుడు వైసీపీ నేత‌లు క్యూ క‌డుతున్నారు.ఈ గ్రామంలో ఉండే దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీసులు తీసుకునేందుకు వారంతా వ‌స్తున్నారు.ఈ మ‌హిళ‌కు అమ్మవారు ఆవహించిన స‌మ‌యంలో ఆమె చెప్పింది అక్ష‌రాల స‌త్యం అవుతుంద‌ని, ఆమె అధికారం వ‌స్తుంద‌ని చెబితే క‌చ్చితంగా వ‌స్తుంద‌ని వాడుక‌లో ఉంది.2019 ఎన్నికల్లో విజ‌య‌మ్మ ఇక్క‌డ‌కు రాగా అప్పుడు వైసీపీకి 150 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంద‌ని ఈమెనే చెప్పిందంట‌.అందుకే ఈమె ప‌లుకుపై అంత న‌మ్మ‌కం.దీంతో స్పీక‌ర్ తమ్మినేని, ఫైర్ బ్రాండ్ రోజా లాంటి వారు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి వెళ్తున్నారు.చూడాలి మ‌రి వారి న‌మ్మ‌కం ఏ మేరకు నిజం అవుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube